చక్కెర బదులు మార్కెట్ లో విరివిగా దొరకే బెల్లం వాడవచ్చు. చెరకు రసం ఇనుప బాండీలలో పోసి మరగబెట్టి బెల్లం తయారు చేస్తారు. భారతీయులు బెల్లంను వేల సంవత్సరాలనుండి వాడుతున్నారు.
బెల్లం మలబద్దకాన్ని వదిలిస్తుంది. కాలేయంలో చేరిన విషపదార్ధాలను బయటకు పంపింస్తుంది. బెల్లం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. భోజనం తరువాత చిన్న బెల్లం ముక్కను తినటం భారతీయుల అలవాటు. గ్రామాలలో ఈ అలవాటును గమనించవచ్చు. ఇనుప బాండీలలో బెల్లం వండటం వలన శరీరానికి ఐరన్ లభిస్తుంది.
బెల్లంలో కూడా చక్కెరలు అధికంగా ఉంటాయి, కనుక మితంగా మాత్రమే వాడాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బెల్లం నిషిద్ధమే. మితంగా వాడవచ్చు.