ఎప్పుడూ వంటగదిలో వుండే సగ్గు బియ్యంలో వుండే పోషకాల గురించి...... వీటిల్లో ప్రొటీన్లు అధికం. ఇవి కండరాలకు పుష్టినిస్తాయి. కణాలవృద్ధికి ఉపయోగ పడతాయి. క్యాల్షియం, ఇనుమూ, విటమిన్ కె సమృద్ధిగా లభిస్తాయి. శరీరంలో ఎముకలు గట్టిగా ఉండటానికి ఇవి దోహదం చేస్తాయి. ఎదిగే చిన్నారులకు సగ్గు బియ్యంతో చేసిన వంటకాలను తరచూ ఇవ్వడం మంచిది. వీటి వల్ల మరో ఉపయోగం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
సగ్గు బియ్యంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హృదయ కవాటాల మీద ఒత్తిడి పడకుండా చూడటంలోనూ వీటిలోని పోషకాలు ఉపయోగపడతాయి. నీరసంగా అనిపించినప్పుడు సగ్గు బియ్యంతో కాచిన జావ తీసుకుంటే తక్షణం శక్తి అందుతుంది. జ్వరం, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యం జావ తాగితే ఎంతో మేలు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలో జరిగే సాంప్రదాయక వివాహాల్లో ఇదివరకు సగ్గు బియ్యంతో చేసే పాయసం తప్పనిసరిగా వడ్డించేవారు. సగ్గు బియ్యాన్ని కర్రపెండలం అనే దుంప నుండి తీసిన పాలతో తయారు చేస్తారు.