ప్రస్తుతం వైట్ టీ తాగమని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు సూచిస్తున్నారు. రోజుకు మూడు కప్పులు తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. తేయాకు చిగురులపై ఉండే చిన్న తెల్లటి అత్యంత స్వచ్ఛమైనవి, మెరుస్తూ ఉండే ముక్కల్ని ఈ టీలో వాడతారు. బ్లాక్, గ్రీన్ టీల్లో ఉండేంత కెఫైన్ కంటే.... ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుంది. ఈ వైట్ టీలో కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. ఇది గ్రీన్ టీ కంటే మంచిదని చెబుతున్నారు. దీని రుచి కూడా చాలా బాగుంటుందని సూచిస్తున్నారు.
చిగురు ఆకులతో తయారుచేసే ఈ టీలో ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంటుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం డార్జిలింగ్ వైట్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే... దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ టీ మహిళలకు అత్యంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందని అంటున్నారు. మరో గొప్ప విషయమేంటంటే... ఈ టీ తయారీకి ఎక్కువ టైమ్ పట్టదు.
ఆన్ లైన్ మార్కెట్‌లో వైట్ టీ బ్యాగ్స్ ప్యాకెట్లు లభిస్తున్నాయి. దాదాపుగా ఒక్కో టీ బ్యాగ్ రూ.20 ఉంటోంది.
200ml నీటిని 5 నిమిషాలు ఉడికించాలి. బుడగలు వస్తున్నప్పుడు నీటిని కప్పులో పొయ్యాలి. అందులో వైట్ టీ బ్యాగ్ వెయ్యాలి. రెండు నిమిషాల్లో అందులోని సారం నీటిలో చేరుతుంది. దీనికి తీపిదనం కోసం చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు తేనె కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది.
- వైట్ టీలో కాటెచిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. అవి మన శరీరంలోని విష వ్యర్థాలతో పోరాడుతాయి.
- గుండె జబ్బుల్ని తగ్గించే గుణాలు వైట్ టీలో ఉన్నాయి.
- పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోవాలంటే వైట్ టీ తాగాలి.
- ఈ టీ తాగేవారిలో ముసలితనపు లక్షణాలు త్వరగా రావట్లేదు. ముడుతలు కూడా త్వరగా రావట్లేదు.
- జుట్టును కాపాడటంలో ఈ టీ బాగా ఉపయోగపడుతోంది.
- సూర్యుడి వేడి నుంచీ చర్మాన్ని, కణాలనూ రక్షించడంలో ఈ టీ చక్కగా పనిచేస్తోంది.