రామారారావు తరువాత తెలుగు సీనీరంగంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వాడు ANR గా పేరుపొందిన అక్కినేని నాగేశ్వరరావు. 75 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం సీనిరంగంలో కొనసాగిన నటుడు అక్కినేని ఒక్కడే. భారత ప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. సీనీ రంగంలో కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నమైన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు కూడా పొందాడు.
సినిమా రంగానికి రాకముందు నాటకాలలో స్త్రీపాత్రలు ధరించి పేరుపొందాడు. తరువాత సీనీ రంగంలో ప్రవేశించాడు. ధర్మపత్ని ఇతని మొదటి సినిమా. తరువాత సీతారామ జననం సినిమాలో నటించాడు. 1953లో నాగేశ్వరరావు సావిత్రితో కలసి నటించిన ‘దేవదాసు’ నాగేశ్వరావు సీనీ జీవితాన్ని మలుపు తిప్పి నటుడిగా నిలబెట్టింది. నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలలో నటించాడు.
అక్కినేని నటించిన సాంఘిక చిత్రాలు బాలరాజు, రోజులు మారాయి, నమ్మినబంటు, మిస్సమ్మ, ప్రేమించి చూడు, ఇల్లరికం, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, భార్యాభర్తలు, మిస్సమ్మ, సంసారం, బ్రతుకు తెరువు, శాంతినివాసం, వెలుగునీడలు అన్నీ హిట్టనవే.
కొన్ని పౌరాణిక చిత్రాలలో నటించాడు. అవి మాయాబజార్ లో అభిమన్యుడు, శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడు, భూకైలాస్ లో నారదుడు.
నడివయసులో అక్కినేని నటించిన ప్రేమాభిషేకం, దసరాబుల్లోడు చిత్రాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ప్రేమాభిషేకం 365 రోజులపాటు నిరవధికంగా ఆడింది.
కొని జానపద సినిమాలలో కూడా నటించాడు అవి కీలుగుర్రం, ముగ్గురు మరాఠీలు, సువర్ణ సుందరి. అక్కినేని నటించిన అమరశిల్పి జక్కన, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ఱ మరచిపోలేని చిత్రాలు.
అక్కినేని నాస్తికుడు దేవుడిని నమ్మడు. కానీ భక్తిరస ప్రధానమైన సినిమాలలో తన అద్భుతమైన నటనా చాతుర్యంతో ప్రేక్షకులకు నిజమైన దైవభక్తునిగా తలపించాడు. భక్త జయదేవ, విప్రనారాయణ, భక్తతుకారాం, కవిక్షేత్రయ్య ఇతను నటించిన భక్తిరస ప్రధానమైన చిత్రాలు.
1991లో అక్కినేని నటించిన సీతారామయ్యగారి మనుమరాలు మంచి విజయాన్ని సాధించింది. అక్కినేని చివరి సినిమా మనం. ఇందులో తన కుమారుడు నాగార్జున, మనవడు నాగార్జున కొడుకు నాగచైతన్యతో కలసి నటించాడు.
అక్కినేని భార్య అన్నపూర్ణ. ఈమె పేరుతో హైదరాబాద్ లో అన్నపూర్ణా స్టూడియోస్ ను నిర్మించారు. అక్కినేని వారసులు అక్కినేని నాగార్జున, నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా సినిమా నటులే ఇంకో మనవడు సుమంత్ కూడా తెలుగు సినిమాలలో నటిస్తున్నాడు. అక్కినేనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు
1923 సెప్టెంబర్ 23వ తేదీన కృష్ణాజిల్లా గుడివాడ నందివాడ మండలంలోని రామాపురంలో జన్మించాడు. 2014 జనవరి 22న తన 91వ యేట అస్తత్త్వతతో హైదరాబాద్ లో మరణించాడు. అక్కినేని 91 సంవత్సరాల పాటు దీర్ఘకాలం జీవించిన సీనీ నటుడు కూడా.