బి. సరోజా దేవి కన్నడ, తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో నటించారు. సీనీ రంగంలో విజయం సాధించిన నటీమణి. ఈమె 1938, 7 జనవరిన బెంగుళూరులో జన్మించింది. సీనిరంగంలో పద్మభూషణ్ అవార్డు పొందిన అరుదైన నటి. ఈమె భర్త శ్రీహర్ష బెంగుళూరులో వ్యాపారవేత్త.
కన్నడ సినిమా మహాకవి కాళిదాసు ఈమె మొదటి సినిమా. ఈమె నటించిన మొదటి తెలుగు సినిమా పాండురంగ మహత్యం. తమిళంలో అప్పటి ఆగ్ర హీరోలైన యం.జి.ఆర్, శివాజీ గణేషన్, తెలుగు ఆగ్రతారలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మరియు హిందీ ఆగ్రతారలతో నటించింది.
భూ కైలాస్, సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, దానవీర శూర కర్ణ మొదలగు పౌరాణిక, జానపద సినిమాలలో నటించింది.
ఈమె నటించిన తెలుగు సినిమాలు పెళ్లిసందడి, పెళ్లికానుక, దాగుడు మూతలు విజయవంతంగా ఆడాయి. దివంగతులైన తన భర్త పేరుమీద, కూతురు పేరుమీద ఛారిట్రబుల్ ట్రస్టు నిర్వహిస్తూ చాలా సంస్థలకు విరాళాలు ఇచ్చింది.