భానుమతి రామకృష్ణ బహుభాషా నటి. గాయని, నిర్మాత, దర్శకురాలు కూడా. ఈమె 1925సెప్టెంబర్ 7 వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో జన్మించింది. ఈమె భర్త తెలుగు మరియు తమిళ సినిమాల దర్శకుడు పి.యస్. రామకృష్ణారావు. వీరికి భరణి అనే సొంత స్టూడియో కూడా ఉంది. 13 సంవత్సరాల వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది.
యన్.టి. రామారావుతో కలసి నటించిన మల్లీశ్వరి ఈమె మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈమె వ్రాసిన అత్తగారి కథలు అనే హాస్య కథలు తెలుగు నాట పేరుపొందాయి. ఇందుకు భారతప్రభుత్వం కూడా పద్మశ్రీ బిరుదు ఈమెను సన్మానించింది.
ఈమె నటించిన తెనాలి రామకృష్ణ, చింతామణి, విప్రనారాయణ, అగ్గిరాముడు, బొబ్బిలి యుద్ధం, మంగమ్మ గారి మనవడు, చండీ రాణి, లైలా మజ్నూ సినిమాలు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. అనేక సినిమాలకు దర్శకత్వం వహించింది.
భానుమతి చెన్నై లోని తన స్వగృహంలో 2005 డిసెంబర్ 24వ తేదీన మరణించింది.