చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశుఖర రావు. తెలుగు సీనీ రంగంలో హీరోగా ప్రవేశించి తరువాత సహాయ నటుడిగా, హాస్య నటుడిగా అనేక పాత్రలు పోషించాడు. ఇతను 1945 మే 23వ తేదీన కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించాడు. ఇతను బి.యస్.సి చదువుకున్నాడు.
రంగులరాట్నం ఇతని తొలిసినిమా. ఇతను నటించిన సుఖదుఃఖాలు, పదహారేళ్ల వయసు, సీతా మహాలక్ష్మి మొదలైన సినిమాలు విజయవంతంగా ఆడాయి. హీరోగా తన సీనీ ప్రస్తావాన్ని ప్రారంభించిన చంద్రమోహన్ తరువాత క్యారెక్టర్ యాక్టర్ గా స్థిరపడ్డాడు.
చంద్రమోహన్ నటించిన కొన్ని సినిమాలు మన్మధుడు, ఆస్తులు అంతస్తులు, శంకరాభరణం, అల్లూరి సీతారామరాజు, బొమ్మా బొరుసా, ఆత్మీయులు.
లౌక్యం, ఒక్కడు, మిర్చి సినిమాలలో చంద్రమోహన్ ను చూడవచ్చు.