సి.యస్.ఆర్ గా పేరుబడ్డ చిలకలపూడి సీతారామాంజనేయులు తొలితరం నటుడు. 1907 జులై 11వ తేదీన కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జన్మించాడు. ఆతరం నటులందరికీ నాటకాల పిచ్చి ఉండేది. నాటకాలలో రామదాసు, తుకారం, సారంగధర పాత్రలలో అలవోకగా నటించి పాటలు కూడ పాడి ఆనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విలన్ గా, హాస్యనటుడిగా పేరుపొందాడు. మాటలను విరచి మెల్లగా అర్ధవంతంగా పలకటంలో నేర్పరి.
1846 లోనే గృహప్రవేశం సినిమాలో కామెడీ విలన్ గా నటించాడు. ఈ సినిమాతో ఈయన జీవితం మలుపు తిరిగింది. జగదేక వీరుని కథలో, అప్పుచేసి సి.యస్.ఆర్ ప్రత్యేక గుర్తింపు పొందింది శకుని పాత్రతోనే. శకుని పాత్రను పోషించటంలో ఎవరైనా ఇతని తరువాతే. పాండవ వనవాసంలో శకుని పాత్ర అద్భుతంగా పోషించాడు. తరువాత మాయాబజార్ లో కూడా శకుని పాత్ర పోషించాడు. పాతాళ భైరవిలో రాజు పాత్ర, జగదేక వీరుని కథ, బొబ్బిలి యుద్ధం, పాత దేవదాసు చిత్రాలలో నటించాడు.
తెలుగు సినిమాలలో విలక్షణ నటుడిగా తనదైన ముద్రవేసిన సి.యస్.ఆర్ తన 56వ యేటన1963 అక్టోబర్ 8వ తేదీన మద్రాసులో మరణించాడు.