గీతాంజలి తెలుగు సినిమాలతో పాటు కొన్ని హిందీ, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలలో కూడా నటించింది. ఈమె 1947 అక్టోబర్ 31వ తేదీన కాకినాడలో జన్మించింది.
చిన్నప్పటి నుండి నాట్యంలో శిక్షణ తీసుకుని నాట్యప్రదర్శనలు ఇచ్చేది. ఈమె అసలు పేరు మణి. సీనిరంగంలో ప్రవేశించిన తరువాత గీతాంజలిగా పేరు మారింది. సీతారామ కళ్యాణం సినిమాలో సీతా దేవి పాత్ర ధరించింది. తరువాత మురళీ కృష్ణ, డాక్టర్ చక్రవర్తి, తోడునీడా, డాక్టర్ చక్రవర్తి, దేవత, లేతమనసులు, పూలరంగడు, గూఢచారి 116, మంచిమిత్రులు, ఆదర్శ కుటుంబం, నిర్ధోషి, కాలం మారింది మొదలగు సినిమాలలో నటించింది.
తన తోటి నటుడు రామకృష్ణను పెళ్లి చేసుకుని సీనీ రంగంనుండి తప్పుకుంది. 2019 అక్టోబర్ 31 తేదీన హైదరాబాద్ లో మరణించింది.