తెలుగు సీనీరంగంలో కృష్ణగా పేరుపొందిన ఇతని అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. ఇతని స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలోని బుర్రిపాలెం. ఇతను నటుడే కాకుండా దర్శకుడు, నిర్మాత కూడా. మొదటి సినిమాలలో చిన్న, చిన్న పాత్రలు వేసి తేనెమనసులు, గూఢచారి 116 సినిమాలలో హీరో వేషం వేసి నటుడిగా గుర్తింపుపొందాడు. తరువాత నలభై సంవత్సరాల పాటు సీనిరంగంలో ఉన్నాడు. సొంతంగా పద్మాలయా స్టూడియోను నిర్మించి సొంత సినిమాలు తీసాడు.
స్వాతంత్యపోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ ఇతని జీవితంలో ఒక మైలు రాయి. యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తరువాత శోభన్ బాబు, కృష్ణల శకం చాలాకాలం పాటు సాగింది. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, మోసగాళ్లకు మోసగాడు, ఉండమ్మా బొట్టుపెడతా, మాయదారి మల్లిగాడు మొదలగు సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. అతి తక్కువ కాలంలోనే వందలాది సినిమాలలో నటించి ఆగ్రహీరోగా పేరుపొందాడు.
ఇతని మొదటి భార్య ఇందిర. సాక్షి సినిమాలో విజయనిర్మలతో నటించి ఆమెతో ప్రేమలో పడి రెండవ వివాహం చేసుకున్నాడు. కృష్ణకు ఐదుగురు సంతానం. వీరిలో చాలామంది సీనీ రంగంలోని వారే. తెలుగునాట ఆగ్రనటుడిగా పేరుపొందిన మహేష్ బాబు ఇతని కుమారుడే. నరేష్ బాబు, రమేష్ బాబు సీనీ రంగంలోనే ఉన్నారు. అల్లుడు సుధీర్ బాబు కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. కూతురు మంజుల కూడా సీనీ రంగంలో ఉంది.
1989 సం.లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు నియోజక వర్గంనుండి లోకసభకు పోటీ చేసి గెలుపొందాడు. తరువాత 1991 సం.లో ఏలూరు నుండి మరలా పోటీ చేసి ఒడిపోయాడు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. రాజకీయాలలో ఉన్నపుడు రామారావుకు ఇతనికి విభేదాలు వచ్చాయి.
కృష్ణ 1942 మే 31న జన్మించాడు. 2020 జనవరి నాటికి జీవించే ఉన్నాడు.