గిరిజ 1950…60 దశకాలలో తెలుగు చలన చిత్రరంగంలో ప్రముఖ హాస్యనటిగా పేరుపొందింది. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తితో సీనీరంగంలో ప్రవేశించింది. తొలి సినిమా శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యుల కథలో అక్కినేని నాగేశ్వరరావు పక్కన హీరోయిన్ గా నటించింది. తరువాత పాతాళభైరవి సినిమాలో చిన్న పాత్రలో నటించింది.
అప్పట్లో రేలంగి, గిరిజ గొప్ప హాస్య జంటగా పేరుపడ్డారు. వీరిద్దరూ కలసి అనేక సినిమాలలో నటించారు. శివాజీ గణేషన్ నటించిన మనోహరలో హీరోయిన్ గా నటించింది. హరనాధ్ తో మా ఇంటి మహాలక్షి, జగ్గయ్యతో అత్తా ఒకింటి కోడలే, రామారావుతో మంచిమనసుకు మంచిరోజులు అక్కినేనితో వెలుగునీడలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. దాదాపు 20 సంవత్సరాలపాటు సినీరంగంలో ఉన్నది.
ఈమె నటించిన కొన్ని సినిమాలు...ఆస్తిపరులు, మంగమ్మ శపధం, రాముడు భీముడు, జగదేక వీరుని కథ, భట్టి విక్కమార్క, పెళ్లికానుక, దైవబలం, ఇల్లరికం, అప్పుచేసి పప్పుకూడు.
తరువాత నిర్మాతగా మారి పవిత్రహృదయాలు, భలేమాస్టారు సినిమాలు తీసారు. ఈ రెండు సినిమాలు కూడా అపజయం పాలవ్వటంతో గిరిజ తన ఇల్లుతో సహా ఆస్తినంతా కోల్పోయింది. తోటి నటుల సహాయంతో కొంతకాలం నెట్టుకొచ్చింది.
గిరిజ 1936 మార్చి 3వ తేదీన కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించింది.