గోవిందరాజు సుబ్బారావు గురించి ఈ నాటి తరానికి తెలియదు. బాగా పెద్దవారికి తెలిసి ఉండవచ్చు. ఇతను తెలుగు సినిమాలలోనూ, నాటక రంగంలోనూ నటించిన తొలితరం నటుడు. బాలనాగమ్మ సినిమాలో మాయల మరాఠీగా నటించాడు. ఇతను వృత్తిరీత్యా వైద్యుడు. తెనాలిలో స్థిరపడి వైద్యుడిగా పేరుపొందాడు. తరువాత హోమియోపతిలో కూడా ప్రావీణ్యం సంపాదించి హోమియో వైద్యం కూడా చేసేవాడు.
చదువుకునే రోజులలోనే నాటకాలలో నటించేవాడు. గయోపాఖ్యానంలో సాత్యకి, భీముడు, బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్ పాత్రలు పొషించాడు. కన్యాశుల్కం, ప్రతాప రుద్రీయం నాటకాలలో నటించాడు. అప్పడప్పుడే ప్రారంభమవుతున్న సినీరంగంలో ప్రవేశించి కేరక్టర్ నటునిగా, ప్రతినాయకునిగా నటించాడు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో రంగయ్యగా, బాలనాగమ్మలో మాయల మరాఠీగా నటించి నటుడిగా పేరు పొందాడు.
పాండురంగమహత్యం, చరణదాసి, పల్నాటి యుద్ధం, గుణసుందరి కథ మొదలగు సినిమాలలో నటించాడు.
గోవిందరాజు సుబ్బారావు 1895 సం.లో జన్మించాడు. ఇతను 1959అక్టోబర్ 28వ తు=దీన చెన్నైలోని తన స్వగృహంలో మరణించాడు.