తెలుగు సీనీరంగంలో అరుదైన నటిగా గుర్తింపు పొందిన అందగత్తె జమున 1936 ఆగస్టు 30 కర్నాటకలోని హంపిలో పుట్టింది. కానీ ఈమె బాల్యం గుంటూరు జిల్లాలో పసుపు పంటకు పేరుపొందిన దుగ్గిరాల గ్రామంలో గడచింది. చిన్నతనంలోనే నాటకాల మీద ఆసక్తితో నాటకాలలో చిన్న చిన్న వేషాలు వేసేది. ఖల్జీరాజ్య పతనం అనే సినిమాలో గుమ్మడితో పాటు నటించింది. బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకుంది.
ఈమె మొదటి సినిమా పుట్టిల్లు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఈమె వేసిన సత్యభామ పాత్ర జమునను నటిగా నిలబెట్టి మంచి పేరు తెచ్చింది. సత్యభామ పాత్రకు జమున తప్ప వేరొకరు పనికి రారు అన్నంతగా నటించింది. వయసులో ఉన్నప్పుడే మూగమనసులు సినిమా చివరిలో ముసలి పాత్రపోషించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇల్లరికం, గుండమ్మకథ, రాముడు భీముడు, దొరికితే దొంగలు, పండంటి కాపురం, మిస్సమ్మ, చిరంజీవులు, దొంగరాముడు మొదలగు విజయవంతమైన సినిమాలలో నటించింది.
గులేబాకావళి కథ, భూకైలాస్, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు, తెనాలి రామకృష్ణ, పల్నాటియుద్దం మెదలగు చారిత్రాత్మక, పౌరాణిక సినిమాలలో కూడా నటించింది.
ఈమె భర్త జూలూరి రమణారావు. శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో పనిచేసి చేసారు. ఇతను 2014 సం.లో మరణించారు.
1980లో రాజమండ్రి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి యం.పి గా గెలిచారు. కానీ తరువాత రాజకీయాల నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈమె జీవించే ఉన్నారు (2020 జనవరి). ఈమె నివాసం హైదరాబాద్