తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్ గా నటించి తరువాత రాజకీయాలలో ప్రవేశించిన జయలలిత జీవితం చిత్ర, విచిత్రమైన మలుపులతో ముగిసింది. ఈమె ఎదుర్కొన్న పరిస్థితులు తెలుగు, తమిళ సీనీ రంగాలలో ఎవరూ ఎదుర్కొని ఉండరు. ఈమె 1948 ఫిబ్రవరి 24వ తేదీన మైసూరు రాష్ట్రంలో మేలుకోటేలో జన్మించింది.
తెలుగు చిత్రసీమలో జానపద సినిమాలలో, సాంఘిక సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జయలలిత నటించిన గూఢచారి 116, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, ఆలీబాబా నలభై దొంగలు, సుఖదుఃఖాలు, అదృష్టవంతులు, తిక్కశంకరయ్య, నిలువు దోపిడి, బాగ్దాద్ గజదొంగ, గండికోట రహస్యం, దేవుడు చేసిన మనుషులు మొదలగు తెలుగు సినిమాలు విజయవంతంగా ఆడాయి. తమిళ చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా నిలచింది.
సీనీరంగం నుండి రాజకీయాలలో ప్రవేశించి 1984 నుండి 1989 వరకు తమిళనాడు తరపున రాజ్యసభ్య సభ్యరాలుగా పనిచేసింది. ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ వేత్త, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన యం.జి.ఆర్ మరణం తరువాత తనకు తాను యం.జి.ఆర్ వారసురాలిగా ప్రకటించుకుంది.
తమిళ శాసనసభలో ప్రతిపక్షాల చేతిలో ఘోర అవమానం పొంది, ఎన్నికలలో పోటీ చేసి అఖంఢ విజయంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. తరువాత అక్రమ ఆస్తుల కేసులో పదవిని కోల్పోయి జైలు పాలయ్యంది. కోర్టులో నిర్ధోషిగా తేలటంలో తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది.
అప్పటి నుండి ఈమె రాజకీయ జీవితం అనేక చిత్రమైన మలుపులు తిరిగింది. 1991 నుండి 1996 దాకా, 2001లో కొంతకాలం, తరువాత 2002 నుండి 2006 దాకా ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పేద ప్రజల కోసం అనేక పధకాలు ప్రవేశపెట్టింది. వాటిలో అమ్మ భోజనం ఒకటి.
ఈమె 2016 జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన చెన్నై అపోలో హాస్పటల్ లో అనారోగ్యంతో మరణించిది. మరణించే ముందు సుమారు రెండున్నర నెలలు అనారోగ్యంతో బాధపడింది. ఈమె మరణం ఇప్పటికి కూడా మిస్టరీనే. ఈమె తన జీవితకాలంలో వివాహం చేసుకోలేదు.