తెలుగు నటిగా స్థిరపడ్డ జయసుధ అసలు పేరు సుజాత. పుట్టి పెరిగింది మాత్రం మద్రాసులో. తెలుగు సినిమాల ప్రముఖ నటి విజయనిర్మల ఈమెకు మేనత్త. పండంటి కాపురం సినిమాతో తన సీనీ ప్రస్తావనాన్ని ప్రారంభించి సుమారు 300 సినిమాలలో నటించింది. కొద్ది తమిళ, మళయాళ సినిమాలలో కూడా నటించింది.
ఈమె 1959 సం. డిసెంబర్17వ తేదీన మద్రాసులో జన్మించారు. ఇది కథ కాదు, మేఘసందేశం, ప్రేమాభిషేకం, కటకటాల రుద్రయ్య సినిమాలలో నటించి నటిగా గుర్తింపబడ్డారు. శ్రీవారి ముచ్చట్లు, శివరంజని, సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి మొదలగు విజయవంతమైన సినిమాలలో నటించారు.
రాజకీయాలలో ప్రవేశించి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ లో పోటీ చేసి ఎం.ఎల్.ఏగా గెలిచారు. తరువాత అదేస్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈమె భర్త నితిన్ కపూర్. వీరికి ఇద్దరు కుమారులు.