కైకాల సత్యనారాయణ తెలుగు సీనీరంగంలో ఒక విలక్షణమైన నటుడు. హాస్యపాత్రల దగ్గరనుండి, పౌరాణిక పాత్రలు, విలన్ పాత్రలు, జానపద విలన్ పాత్రలు, సాంఘిక పాత్రలు ధరించాడు. ఇతనిని నవరస నాట్య సౌర్యభౌమ అని పిలిచేవారు.
ఇతను 1935 సంవత్సరం, జులై 25న కృష్ణాజిల్లా, గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించాడు. ఇతను పట్టభ్రదుడు. మొదటగా సిపాయి కూతురు అనే సినిమాలో నటించాడు. తరువాత సహస్రశిరచ్ఛేద చింతామణి సినిమాలో నటించాడు. కనకదుర్గ పూజామహిమలో విలన్ గా నటించాడు. అప్పటి నుండి విలన్ పాత్రలకు పేరుపొందాడు. అగ్గిదొర, చిక్కడు దొరకడు, భువన సుందరి కథ, పాండవ వనవాసం, మొదలగు అనేక పౌరాణిక, జానపద సినిమాలలో నటించాడు. ఏ పాత్రవేసినా అందులో జీవించేవాడు.
మయగోల, యమలీల సినిమాలలో యముడిగా అద్భుతంగా నటించాడు. సొంతంగా కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాల తీసి నటించాడు. 1959 సం.లో మొదలుపెట్టి 2000 సంవత్సరం దాకా సుమారు 40 సంవత్సరాల పాటు చలన చిత్రాలలో నటించాడు.
1996 సం.లో రాజకీయాలలో ప్రవేశించి తెలుగుదేశం అభ్యర్థిగా లోకసభ (యం.పి) సభ్యునిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం (2020 జనవరి) నాటికి జీవించే ఉన్నాడు.