కె.ఆర్. విజయ కేరళ రాష్ట్రంలో 1948 నవంబరు 30వ తేదీన జన్మించింది. కానీ ఈమె బాల్యం నేటి తమిళనాడు రాష్ట్రంలో గడచింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం సినిమాలలో నటించింది.
చిన్న తనం నుండి నాట్య ప్రదర్శనలు ఇచ్చేది. జెమినీ గణేశన్ తో కలిసి మొదటి సారిగా కర్పగం అనే తమిళ సినిమాలో నటించింది. 1966 సం.లో తెలుగుతో నిర్మించిన శ్రీకృష్ణ పాండవీయం తెలుగు సినిమాలో రుక్మిణి దేవి పాత్ర పోషించింది. తరువాత పరమానందయ్య శిష్యుల కథలో హీరోయిన్ గా నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఏకవీర, లక్ష్మీకటాక్షం, విశ్వనాధ నాయకుడు, యోగి వేమన సినిమాలలో నటించింది. శివాజీ గణేషన్ తో ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. తెలుగులో అమ్మవారి (దేవత) పాత్రల నటిగా పేరు పొందింది.