తెలుగు సీనీ రంగంలో కృష్ణంరాజుగా పేరుపొందిన ఇతని అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. సహాయనటుడిగా సీనీ ప్రస్థావనం ప్రారంభించిన ఇతను తరువాత హీరోగా చాలా సినిమాలలో నటించాడు. హీరో తరువాత తండ్రి పాత్రలు ధరించాడు.
ఇతను 1940 జనవరి 20 వ తేదీన జన్మించాడు. ఇతని స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. క్షత్రీయ వంశానికి చెందినవారు. ఇతని భాగస్వామి శ్వామలా దేవి. వీరికి ముగ్గురు కుమార్తెలు. కుమారులు లేరు.
చిలకా గోరింకలో మొదటిసారిగా నటించాడు. తరువాత నేనంటే నేను, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పవిత్రబంధం, ద్రోహి, రైతు కుటుంబం, తాజ్ మహల్, మానవుడు దానవుడు, బడిపంతులు, జీవన తరంగాలు, జీవన జ్యోతి, మాయదారి మల్లిగాడు, కృష్ణవేణి, కటకటాల రుద్రయ్య, మన వూరి పాండవులు, తాతా మనవడు, రెబల్ మొదలగు సినిమాలలో నటించాడు.
తరువాత రాజకీయాలలో ప్రవేశించి భారతీయ జనతా పార్టీలో చేరాడు. కాకినాడ నియోజక వర్గం నుండి లోకసభ సభ స్థానానికి పోటీ చేసి (12వ లోకసభ) గెలుపొందాడు. 13 లోకసభకు కూడా పోటీ చేసి గెలుపొంది అటల్ బీహార్ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడు అతని మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. 2009లో జనతాపార్టీని వదలి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. రాజమండ్రి నుండి లోకసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు.
తెలుగునాట ప్రస్తుతం ఆగ్రహీరోగా పేరుబడ్డ ప్రభాస్ కృష్ణంరాజు సోదరుని కుమారుడు