యల్.విజయలక్షి తెలుగు సీనీరంగంలో తెలుగు, తమిళ, మళయాళ సినిమాలలో నటించింది. ఈమె నటిగా కాకుండా గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ గా పేరుపొందింది. భరతనాట్య కళాకారిణి. నృత్యాలను చాలా నేర్పుతో, సునాయాసంగా చేసేది. ఈమె 1943 సం.లో మద్రాసులోని ఎర్నాకులంలో జన్మించింది. ఈమె చిన్నతనంలోనే దేవాలయాలలో, సభలలో నాట్యప్రదర్శనలు చేసింది.
జగదేక వీరుని కథ, నర్తనశాల, పరమానందయ్య శిష్యుల కథ సినిమాలలో ఈమె నాట్యం చూడవలసిందే. ఇంకా పునర్జన్మ. పూజాఫలం, బొబ్బిలియుద్ధం, పిడుగురాము, రాముడు భీముడు, గుండమ్మ కథ సినిమాలలో నటించింది.
1960 దశకం చివరిలో మనీలా (ఫిలిఫైన్స్)లో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఙుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్లిచేసుకొని సినిమారంగం నుండి విరమించుకొని మనీలాలో స్థిరపడింది. వివాహం ఐన తరువాత కూడా కష్టపడి ఉన్నత చదువులు చదివింది. తరువాత అకౌంటింగ్ విద్యలో ఉత్తీర్ణత పొంది అమెరికాలోని వర్జీనీయా పాలిటెక్నిక్ విశ్వ విద్యాలయంలో బడ్డెట్ అధికారిగా పనిచేస్తుంది.