మిక్కిలినేనిగా పేరుపొందిన ఇతను రచయిత, సీనీ నటుడు మరియు రంగస్థల నటుడు కూడా. సీనిరంగానికి రాకముందు జానపద, సాంఘిక, పౌరాణిక నాటకాలలో మగ వేషాలతో పాటు స్త్రీ పాత్రలు కూడా పోషించాడు. అప్పటికి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోని పలుసార్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాం ప్రాంతంలో నిజాంల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాడాడు.
1949 సం.లో దీక్షతో తెలుగు సీని రంగంలో ప్రవేశించాడు. సుమారు 400 వందల సినిమాలకు పైగా నటించాడు. తేలుగు నేల మొత్తం తిరిగి స్వయంగా సేకరించి తెలుసుకున్న సమాచారం ఆధారంగా 400 వందల మంది కళాకారులను ‘ఆంధ్రుల నటరత్నాలు’ ద్వారా పరిచయం చేసాడు. తెలుగువారి జానపద కళారూపాలు, మన పగటి వేషాలు, ఆంధ్రనల నృత్యకళావికాసం మొదలగు పరిశోధనాత్మక గ్రంధాలను రచించాడు. ఒకప్పుడు సొంతవారి చేతే నష్టజాతకుడనిపించుకున్న ఇతను మిక్కిలినేని ఇంటిపేరు గల వారికి గర్వకారణమయ్యాడు. సినిరంగంలో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లు – మిక్కిలినేని దిగాల్సిన మెట్లు లేవు’ అనే నానుడి ఉంది.
ఆనాటి ప్రముఖులు ప్రజానాట్యమండలి ఏర్పాటు చేసి పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, కాటమరాజు కథ మొదలగు నాటకాలను ప్రదర్శించి ప్రజలను ఏకతాటిపై నడిపించారు. ఫలితంగా ప్రజానాట్యమండలి 1940 సం.లో నిషేధానికి గురైంది. అందులో చాలామంది సీని రంగానికి మరలారు. వారిలో మిక్కిలినేని కూడా ఒకరు.
అనేక సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాలలో నటించాడు. మాయాబజార్, పల్నాటియుద్ధం, అప్పుచేసి పప్పుకూడు, తెనాలి రామకృష్ణ, దక్షయజ్ఙం, గులేబా కావళి కథ, బందిపోటు, లక్షాధికారి, నర్తనశాల, రాముడు భీముడు, సంపూర్ణ రామాయణం, పాండవ వనవాసం, అంతస్తులు, శ్రీకృష్ణావతారం మిక్కిలినేని నటించిన కొన్ని సినిమాలు.
1982 సంలో. మిక్కిలినేనిని ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, మరియు కళాప్రపూర్ణ బిరుదులతో సత్కరించింది. ఇతను 1914 జులై 7 వ తేదీన గుంటూరు జిల్లాలోని లింగాయపాలెం గ్రామంలో జన్మించారు. 2011, ఫిబ్రవరి 23వ తేదీన విజయవాడలో మరణించారు. సినిమా నటులలో 95 సంవత్సరాల పాటి జీవించిన వారిలో మొదటివాడు.