మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. సినిమా పేరు మోహన్ బాబు. ఇతను నటుడు, రాజకీయ వేత్తకూడా. ఇతను 1952 మార్చి 19వ తేదీన జన్మించాడు. జన్మస్థలం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగుల పాలెం. బౌతికశాస్త్రంలో డిగ్రీవరకు చదువుకున్నాడు. సినిమాలలోకి రాక ముందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సినిమా రంగంలో ఐదు సంవత్సరాల పాటు దర్శకత్వ విభాగంలో పనిచేసాడు. దాసరి నారాయణ రావును తన గురువుగా చెప్పుకుంటాడు. దాసరి తీసిన స్వర్గం నరకం సినిమాలో నటించాడు.
తరువాత అనేక సినిమాలలో విలన్ గా నటించాడు. తరువాత హీరోగా మారాడు. ఇతను నటించిన పెదరాయిడు ఇతనికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. నిర్మాతగా అనేక విజయవంతమైన సినిమాలు తీసాడు. ఇతని ఇద్దరు కుమారులు మంచు మనోజ్, విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్నలు కూడా సీనీరంగంలోనే ఉన్నారు.
రాజకీయాలలో ప్రవేశించి రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. 1992 సం.లో విద్యారంగంలో అడుగుపెట్టి శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్టును స్థాపించి పాఠశాలతో పాటు, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలను నడుపుతున్నాడు.
2007 సంవత్సరంలో మోహన్ బాబును భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది