ఇతను ఫిబ్రవరి 20, 1920 సం.లో గుంటూరు జిల్లాలోని గురజాలలో జన్మించాడు. విద్యర్థి దశలోనే నాటకరంగంమీద ఆసక్తి పెంచుకుని నాటకాలలో వేషాలు వేసేవాడు. బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ దొర పాత్రు అద్భుతంగా పోషించేవాడు. ఈ అనుభవంతోనే ఇతనికి బొబ్బిలి యుద్ధంలో సినిమాలో కూడా బుస్సీ దొర పాత్ర పోషించాడు. ఏ పాత్ర ధరించినా ఆ పాత్రలో ఒదిగిపోయేవాడు.
డిగ్రీ పూర్తయిన తరువాత లా చదువుదామని మద్రాసు చేరాడు. కానీ సినిమాలలో అవకాశాలు రావటంతో సీనీ రంగంలో ప్రవేశించాడు. మొదటగా మాయామశ్చీంద్ర సినిమాలో గోరఖ్ నాధ్ పాత్ర పోషించాడు. లైలా మజ్నూ లో భానుమతి తండ్రిగా నటించాడు. అనేక జానపద సినిమాలలో విలన్ గా, రామారావు తండ్రిగా కూడా నటించాడు. జగదేక వీరుని కథలో రామారావు తండ్రి పాత్ర పోషించాడు.
మాయాబజార్ లో దుర్యోధనిని పాత్ర పోషించి మొప్పించాడు. రాజమకుటం, అప్పుచేసి పప్పుకూడు, మహామంత్రి తిమ్మరుసు సినిమాలలో నటించాడు. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో జరాసంధుని పాత్రను పోషించి ఆ పాత్రకు న్యాయం చేసాడు.
గూఢచారి 116, నిర్ధోషి, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం మొదలగు సాంఘిక సినిమాలలో నటించాడు.
1987 జనవరి 10వ తేదీన మరణించాడు.