తెలుగు సీనీ రంగంలో అనేక సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన ప్రభాకర రెడ్డి స్వతహాగా వైద్యుడు. ఇతని పూర్తి పేరు డా.మందాడి ప్రభాకర రెడ్డి. 1935 సం. అక్టోబరు 6వ తేదీన తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని తుంగత్తూరులో జన్మించాడు.ఇతను రచయిత కూడా కార్తీకదీపం సినిమాకు కథ అందించినది ఇతనే.
1960 సం.లో చివరికి మిగిలేది సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. ఇతను నటించిన సినిమాలు పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, కార్తీకదీపం, ఉమ్మడి కుటుంబం, ఆత్మీయులు, అల్లూరి సీతారామరాజు, ఎదురులేని మనిషి, కటకటాల రుద్రయ్య మొదలగు సినిమాలు విజయవంతంగా ఆడాయి.
ఇతను కొన్ని జానపద, పౌరాణిక సినిమాలలోకూడా నటించాడు. పాండవ వనవాసం, భీష్మ, నర్తనశాల, బొబ్బలి యుద్ధం, పల్నాటియుద్ధం, లక్ష్మీ కటాక్షం సినిమాలలో నటించాడు.
ఇతను