రాజశ్రీ అసలు పేరు కుసుమ కుమారి. 1945 ఆగస్టు, 31వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించింది. అప్పట్లో జానపద చిత్రాలలో హీరోయిన్ గా నటించి పేరు పొందింది. యన్.టి.రామారావు, రాజశ్రీ, కాంతారావు, రాజశ్రీ జంటగా నటించిన ప్రతి జానపద చిత్రం హిట్టే. రాజశ్రీ అందదగత్త, సునాయాసంగా నాట్యం చేసేది.
మహామంత్రి తిమ్మరుసు, అగ్గిపిడుగు, పిడుగు రాముడు, తోటలో పిల్ల కోటలో రాణి, ప్రతిజ్ఞాపాలన, అగ్గి బరాటా, గోపాలుడు భూపాలుడు మొదలగు విజయవంతమైన జానపద సినిమాలలో నటించింది.
ఈమె నటించిన సాంఘిక చిత్రాలు గోవుల గోపన్న, చిట్టి చెల్లెలు, పట్టిందల్లా బంగారం, ఆత్మ గౌరవం, మాగల్యం, దేవుడు చేసిన మనుషులు అన్నీ హిట్ సినిమాలే.
రాజశ్రీ గుంటూరు జిల్లా, చిలకలూరి పేటకు చెందిన రాజకీయ వ్యక్తి తోట పాంచజన్యంను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇతను జీవించిలేడు