రామకృష్ణ సుమారు 200 సినిమాలకు పైగా నటించాడు. ఇందులో ఎక్కువగా తెలుగు సినిమాలు, తరువాత తమిళ, మళయాళ సినిమాలున్నాయి. ఇతను 1939, 15 అక్టోబర్ న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించాడు.
యశోదాకృష్ణ, నోము,పూజ, దేవుడే దిగివస్తే, భక్తతుకారాం, భట్టి విక్రమార్క, బొమ్మా బొరుసా, సంపూర్ణ రామాయణం, మొదలగు విజయవంతమైన సినిమాలలో నటించాడు. యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో కలసి కొన్ని సినిమాలలో నటించాడు. ఇతను మొదటి భార్యకు విడాకులిచ్చి తరువాత తెలుగు నటి గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. గీతాంజలి, రామకృష్ణ చాలా సినిమాలలో కలసి నటించారు.
ఇతను 22 అక్టోబర్ 2001 లో మరణించాడు.