రమాప్రభ తెలుగు చలన చిత్రరంగంలో హాస్యనటిగా పేరుపొందింది. సినిమాలలోకి రాకముందు నాటకాలలో వేషాలు వేసేది. 1947 మే 6వ తేదీన జన్మించింది. చిన్నతనంలోనే మద్రాసు చేరుకుని సినిమాలలో నటించి హాస్యనటిగా పేరు తెచ్చుకుంది. 11970 నుండి 1980 మధ్యలో అనేక సినిమాలలో నటించింది.
అప్పట్లో రాజబాబు, రమాప్రభ హాస్య జంటగా పేరుపడ్డారు. తరువాత అల్లురామలింగయ్య, పద్మనాభంతో కూడా పలు సినిమాలలో నటించింది. తెలుగు నటుడు శరత్ బాబును వివాహం చేసుకుని 14 సంవత్సరాలు కాపురం చేసి విడాకులు తీసుకుంది.
ఈమె నటించిన కొన్ని చిత్రాలు చిలకా గోరింక, వింతకాపురం, బొమ్మా బొరుసా, తాతా మనవడు, ఇద్దరు అమ్మాయిలు, మనుషులంతా ఒక్కటే, అప్పుల అప్పారావు. చివరి దశలో టి.వి సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుత కాలానికి ఈమె మదనపల్లిలో నివసిస్తుంది. (2010 జనవరి).