ఊర్వశిగా మూడు సార్లు అవార్డులు అందుకున్న ఈమె అసలు పేరు తాడిపర్తి సరస్వతి. ఈమె 1945 జూన్ రెండవ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. వీరిది చేనేత వర్గానికి చెందిన కుటుంబం. చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుని నాటాకాలలో నటించింది. రక్తకన్నీరులో అప్పటికి పేరుపొందిన నటుడు నాగభూషణం పక్కన హీరోయిన్ గా నటించింది.
1975లో ఒక మళయాళిని పెళ్లిచేసుకుని కేరళ వెళ్లింది. అక్కడ స్వయంవరం అనే మళయాళ చిత్రంలో నటించింది. ఈమె నటనకు జాతీయ అవార్డు లభించింది. మళయాళంలో వచ్చిన తులాభారం, తెలుగులో వచ్చిన నిమజ్జనం సినిమాలలో నటించి రెండుసార్లు ఊర్వసి అవార్డు అందుకున్నది. ముందు హాస్యప్రధానమైన సినిమాలలో నటించిన శారదకు తరువాత గంభీరమైన, బరువైన పాత్రలు లభించాయి. మానవుడు దానవుడు, బలిపీఠం, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ సినిమాలలో గంభీరమైన పాత్రలలో నటించింది.
ఈమె తెలుగు చిత్రాల హాస్యనటుడు చలంను పెళ్లిచేసుకుంది కానీ తరువాత విడాకులు తీసుకున్నారు.
1996 సం.లో రాజకీయ రంగంలో ప్రవేశించి తెనాలి యం.పిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.