వ్యవసాయ సంబంధ ఉత్పాదకతను పెంచడంలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌ది ప్రధాన పాత్ర. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఆంగ్లమాధ్యమంలో ఉంటుంది. ఏడాదికి రెండు సెమిస్టర్లు. కోర్సులో భాగంగా ఇంజినీరింగ్ డ్రాయింగ్, అగ్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, లాండ్ సర్వేయింగ్, సాయిల్ సైన్స్, గ్రీన్‌హౌజ్ టెక్నాలజీ, సోలార్, విండ్ ఎనర్జీ, బయో ఎనర్జీ, అగ్రి ఎకనామిక్స్ మొదలైన అంశాలను నేర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్సు అందిస్తున్న సంస్థలు...
ఆంధ్రప్రదేశ్: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అనకాపల్లి, కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు.
తెలంగాణ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ (హైదరాబాద్) పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్.