కాలానుగుణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో ఇవి కేవలం మానవ వనరులపైనే ఆధారపడేవి. క్రమేణా దానిలో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విధానాలు చోటు చేసుకున్నాయి. ఉత్పాదకతను
పెంచడంలో.. విభిన్న పనిముట్లు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, బయాలజీ సంబంధిత అంశాల వంటి వాటి పాత్ర పెరిగింది. దీంతో తగిన సమాచారాన్ని, జాగ్రత్తలను అందించడానికి నిపుణుల అవసరం ఎక్కువైంది.ఈ పరిస్థితులను
దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో పాలిటెక్నిక్ కోర్సులను ప్రవేశపెట్టింది. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక విభాగాల్లోని ఈ కోర్సులను పూర్తిచేస్తే అగ్రి ఇంజినీర్, అగ్రి మేనేజర్, రిసెర్చ్
అసోసియేట్, అగ్రి ఇన్‌స్పెక్టర్, హేచరీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల్లో చేరవచ్చు. వాటిని ఫుడ్ ప్రొడక్షన్ సంస్థలు, ప్రభుత్వ వ్యవసాయ సంబంధిత సంస్థలు, ఫెర్టిలైజర్లు, హేచరీలు, పాల ఉత్పత్తి సంస్థలు అందిస్తాయి.
వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేకంగా రాతపరీక్ష ఏమీలేదు. నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా జూన్‌లో ప్రకటనలు వెలువడతాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు ప్రైవేటు (అఫ్లియేటెడ్)
పాలిటెక్నిక్ సంస్థలూ కోర్సులను అందిస్తున్నాయి. పది లేదా తత్సమాన విద్య పూర్తి చేసుండాలి. పదోతరగతి మార్కుల మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అలాగే ఒకటి నుంచి పదో తరగతి మధ్యలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ
ప్రాంతాల్లో చదివి ఉండాలి. పదోతరగతి కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనవారూ, ఇంటర్ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తయినవారు మాత్రం అనర్హులు. వయసు 15 నుంచి 22 మధ్య ఉండాలి.
Diploma in Agriculture…డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
Agricultural Engineering and Technology…అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ and టెక్నాలజీ
Diploma in Organic Forming…డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్
Diploma in Hearty Culture…డిప్లొమా ఇన్ హార్టికల్చర్
Diploma in Animal Husbandry…డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ
Fisheries Polytechnic… ఫిషరీస్ పాలిటెక్నిక్
Dairy Processing …డెయిరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్