పాలు, పాల సంబంధ ఉత్పత్తులకు సంబంధించిన కోర్సు ఇది. ఇందులో భాగంగా డెయిరీ బిజినెస్ మేనేజ్‌మెంట్, డెయిరీ ఇంజినీరింగ్, డెయిరీ టెక్నాలజీ, క్వాలిటీ అస్యూరెన్స్ అంశాలను నేర్చుకుంటారు. కాలవ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధిస్తారు. నాలుగో సెమిస్టర్‌లో ఇన్‌ప్లాంట్ శిక్షణ కూడా ఉంటుంది. ఒకే ఒక ప్రైవేటు సంస్థలో కోర్సు అందుబాటులో ఉంది.
ఆంధ్రప్రదేశ్: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలోని డెయిరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్, గుంటూరు