పశువులు, కోళ్లు, బాతుల వంటివాటికి సంబంధించిన కోర్సు ఇది. ప్రాథమిక పశు అంతర్నిర్మాణం, పశువులు, కోళ్ల పరిశ్రమల యాజమాన్యం, హేచరీలు, పాల సేకరణ, రవాణా మొదలైన అంశాలను విద్యార్థులు తెలుసుకుంటారు. కాలవ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు...
ఆంధ్రప్రదేశ్: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి పరిధిలో పలమనేరు (చిత్తూరు)
మడకశిర, రాపూరు (నెల్లూరు),
గరివిడి (విజయనగరం జిల్లా)
వెంకట్రామన్నగూడెం (పశ్చిమగోదావరి జిల్లా)
రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా)
బనవాసి (కర్నూల్ జిల్లా)ల్లోని యానిమల్ హజ్బెండరీ కాలేజీలు.
తెలంగాణ: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పరిధిలోని కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, మమ్మూరు (వరంగల్ జిల్లా)ల్లోని యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కళాశాలలు.