header

Diploma in Hearty Culture…డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌

Diploma in Hearty Culture…డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌
వివిధ రకాల పండ్లు, పూల మొక్కలకు సంబంధించిన కోర్సు ఇది. మొక్కల పెంపకం, పెంపకంలో జాగ్రత్తలు, వ్యాధులు మొదలైన వాటన్నింటి గురించీ తెలుసుకుంటారు. తోటలు, ఉద్యానవనాల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, ఔషధాలు, డెకరేటివ్‌ పూలు మొదలైనవాటి పెంపకం ఇందులో భాగం. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. పదో తరగతి మెరిట్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్సును అందిస్తున్న సంస్థలు..
ఆంధ్రప్రదేశ్‌: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో బీ ఎస్‌కేపీపీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, రామచంద్రాపురం
తూర్పు గోదావరి బీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌
నూజివీడు, కృష్ణా జిల్లా బీ ఎస్‌ఎస్‌పీజీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌
మడకశిర, అనంతపురం బీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, కలికిరి, చిత్తూరు
తెలంగాణ: శ్రీ కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో దస్నాపూర్‌ (ఆదిలాబాద్‌)
రామగిరి ఖిల్లా (కరీంనగర్‌) ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలలు