జీవ కణాలకు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బయోటెక్నాలజీగా పిలుస్తాం. సూక్ష్మజీవుల పాత్ర మనిషి జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది. వాటి సూక్ష్మ అధ్యయనానికి ఈ కోర్సు దోహదపడుతుంది. ఇది ఇంటర్ డిసిప్లినరీ కోర్సు కావడంతో వ్యవసాయ, ఔషధ, పర్యావరణ రంగాల్లో నిపుణులను తయారు చేయడంతోపాటు ఆయా రంగాల్లో విద్యకు, ఉద్యోగాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. బీఎస్‌సీ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులను బైపీసీ తరువాత ఎంచుకోవచ్చు.
అనేక ప్రముఖ సంస్థల్లోని బయోటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (కంబైన్డ్ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్)ను న్యూదిల్లీలోని జేఎన్‌యూ నిర్వహిస్తోంది. బయోటెక్నాలజీ డిగ్రీ, పీజీ పట్టభద్రులకు మన దేశంతోపాటు విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో బెంగళూరు, లఖ్‌నవూ, గుడ్‌గావ్‌ల్లో స్థాపించిన బయోటెక్ పార్కులు, హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్ వంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఉద్యోగాలు ఉంటాయి.