తోటలు, ఉద్యానవనాల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, ఔషధాలు, అలంకరణ పూలు మొదలైనవాటి పెంపకం ఇందులో భాగం. నర్సరీలు, గ్రీన్‌హౌజ్‌లు, ప్లాంటేషన్లు మొదలైనవాటిని నిర్వహిస్తారు. కోర్సు వ్యవధి- మూడేళ్లు.
ఇంటర్‌లో బైపీసీ చదివినవారు అర్హులు. హార్టిసెట్ రాయడం ద్వారా ప్రవేశం పొందవచ్చు. సేంద్రియ పదార్థాల ప్రాధాన్యం పెరుగుతుండటంతో ఈ రంగంలో నిపుణుల అవసరం ఎక్కువవుతోంది.
కోర్సు వివరాలు
- డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం, ----ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టీకల్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్
తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, కోయంబత్తూరు గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, పంత్ నగర్
మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్, పుణె
ఉద్యోగ అవకాశాలు : ఈ కోర్సులో డిగ్రీ చేసినవారు ఫ్లోరికల్చరిస్ట్, ఒలెరికల్చరిస్ట్, ఇళ్లు, కార్యాలయాలకు పార్క్‌లు, గార్డెన్లు రూపొందించే లాండ్ స్కేపర్లు, విటి కల్చరిస్ట్, పోమాలజిస్ట్ మొదలైనవాటిల్లో స్థిరపడవచ్చు. హార్టికల్చర్ సైంటిస్టుగా పరిశోధనల్లో పాల్గొనవచ్చు. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు.