మనకు సమతూకమైన ఆహారాన్ని అందించడమే న్యూట్రిషన్ ముఖ్య ఉద్దేశం. ఈ కోర్సులో మనిషి శరీరం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మొదలగునవి ఉంటాయి. ఈ కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు. డిగ్రీతో సమానం. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయబచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో నాలుగేళ్లు కూడా ఉంది. ఈ కోర్సులో తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, కాలేజీ ఆఫ్ హోంసైన్స్ బీఎస్సీ ఆనర్స్ అందిస్తోంది. వీటిలో ఎమ్మెస్సీతో పాటు పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. ఇంకా న్యూదిల్లీలోని దిల్లీ యూనివర్సిటీ (లేడీ ఇర్విన కాలేజీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోం ఎకనామిక్స్, కోల్‌కతాలోని జేడీ బిర్లా యూనివర్సిటీ, లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అన్నిరాష్రాలలోని ప్రాంతీయ యూనివర్శిటీలు, మరియు కళాశాలలు కూడా ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.