header

Foreign Languages…విదేశీ భాషలతో...ఉద్యోగావకాశాలు...

Foreign Languages…విదేశీ భాషలతో...ఉద్యోగావకాశాలు...
ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం విదేశీ భాషలు వచ్చినవాళ్లకు ప్రాధాన్యం పెరిగింది. జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు.
ఈ కోర్సులకు దేశంలోనే ఉత్తమ వేదిక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- హైదరాబాద్‌. దీనికి లఖ్‌నవూ, షిల్లాంగ్‌ల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి.
కోర్సులు, అర్హతలు: ఇంగ్లిష్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ విభాగాల్లో బీఏ (ఆనర్స్‌) కోర్సులు ఉన్నాయి. అర్హత ఇంటర్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు భరించడానికి నెలకు రూ.వెయ్యి స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు.
ఉస్మానియాతో సహా పలు యూనివర్సిటీలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి.