header

Modern Courses...ఆధునిక కోర్సులు

Modern Courses...ఆధునిక కోర్సులు
ఇంటర్ తరువాత సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరడం సాధారణం. కానీ ఇప్పుడు కొన్ని ఆధునిక కోర్సులకు ఆకర్షితులయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాలానుగుణంగా ఎన్నో సరికొత్త రంగాలు, వాటికి అవసరమైన కోర్సులూ ఆవిర్భవిస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. కంప్యూటర్ల రాకతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఊపందుకుంది. పర్యావరణంలోని అసమతౌల్యం పర్యావరణ నిపుణులకు గిరాకీ పెంచింది. భూగర్భ పరిశోధనలకు, హోటల్ మేనేజ్‌మెంట్ రంగాల్లో ఔత్సాహికులకు ఇప్పుడు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఇవే కాకుండా జెమ్మాలజీ, ఓషనోగ్రఫీ లాంటి పలు ప్రత్యేక రంగాలు ఆధునిక కోర్సులకు , ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. దేశంలోని అనేక యూనివర్సిటీలు రెగ్యులర్ కోర్సులతోపాటు ఆధునిక, ఉపాధికి అవకాశం ఉన్న అనేక కోర్సుల్లో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పిహెచ్.డి. మొదలైన కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రకటనలు వెలువడినప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్
ప్రైవేటు రంగంలో కార్పొరేట్ కంపెనీలు విస్తరించడం, ప్రజల్లో పర్యటక ప్రదేశాలపై మక్కువ ఎక్కువ కావడం లాంటి కారణాలతో దేశంలోనే కాదు, ప్రపంచంలోకూడా టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్ రంగాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. నిపుణుల అవసరం బాగా పెరిగింది. ఈ రంగానికి కావాల్సిన మానవ వనరులను తీర్చిదిద్దడానికి యూనివర్సిటీలు, విద్యా సంస్థలు డిగ్రీ, పీజీ కోర్సులు నిర్వహిస్తున్నాయి.
ఈ కోర్సుల ద్వారా టూరిస్ట్ గైడ్‌లు, హోటల్ ఎగ్జిక్యూటివ్‌లు, ఈవెంట్ నిర్వాహకులు తదితర హోదాల్లో ఉపాధి పొందవచ్చు. టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో నిపుణులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
శిక్షణ సంస్థలు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, న్యూఢిల్లీ.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ. వీటితోపాటు వైజాగ్ లోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్, ఉస్మానియా, నాగార్జున యూనివర్సిటీలు, ఇతర సంస్థలు హోటల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు నిర్వహిస్తున్నాయి.
వెబ్‌సైట్‌లు: http://www.ihmhyd.org (or) www.nchmct.org
డిజాస్టర్ మేనేజ్ మెంట్
ప్రమాదాల్లో కొన్ని మానవ తప్పిదాల వల్ల, మరికొన్ని ప్రకృతి పరంగా జరుగుతాయి. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు లావా వెదజల్లడం, కొండచరియలు విరిగిపడటం, తుపానులు, వరదలు, అగ్నిప్రమాదాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు.
విమాన ప్రమాదాలు, గ్యాస్ లీకేజీ లాంటివి మానవ తప్పిదాలకు ఉదాహరణలు.
ఇలాంటి సందర్భాల్లో ఏంచేయాలి? ప్రమాదాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వచ్చిన తరువాత ఎలాంటి చర్యలు చేపట్టాలి? మొదలైన విషయాలను వివరించేందుకు నిపుణుల సహకారం చాలా అవసరం. ఈ రంగానికి సమర్థులైన మానవ వనరుల అవసరం ఉందని గుర్తించిన యూనివర్సిటీలు, ఇతర శిక్షణ సంస్థలు రెగ్యులర్ దూర విద్యావిధానాల్లో 'డిజాస్టర్ మేనేజ్ మెంట్' పేరుతో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తున్నాయి.
వాటిలో కొన్ని..
1. టాటా ఇన్ స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్, ముంబయి
2. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.
3. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
4. అన్నామలై యూనివర్సిటీ.
5. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ
6. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్, భోపాల్.
ఫ్యాషన్ టెక్నాలజీ
ఆధునిక ప్రపంచంలో యువతరాన్ని అధికంగా ఆకర్షిస్తున్న రంగం ఫ్యాషన్ టెక్నాలజీ. ఫ్యాషన్ కెరీర్ గురించి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లాంటి సంస్థలు అనేక కోర్సులను అందిస్తున్నాయి. కేంద్రజౌళి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న నిఫ్ట్ ఇంటర్ వారికి ప్రత్యేకంగా ఫ్యాషన్ కోర్సులను నిర్వహిస్తోంది. వీటిలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (లెదర్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్ మొదలైనవి), బ్యాచ్‌లర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మొదలైన కోర్సులు ఉన్నాయి. ఎంపిక నిమిత్తం ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ కోర్సులు చదవడం వల్ల ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, వెబ్, ఆడియో- విజువల్ మీడియా రంగాల్లో, టెక్స్‌టైల్ కంపెనీల్లో ఫ్యాషన్ డిజైనర్లుగా, ప్రొడక్ట్ డిజైనర్లుగా, కంప్యూటర్ గ్రాఫిక్ ఆర్టిస్టులుగా తదితర ఉద్యోగాల్లో చేరవచ్చు.
వెబ్‌సైట్‌లు: www.nift.ac.in (or) www.pearlacademy.com
ఫైర్ ఇంజినీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
అగ్నిప్రమాదాలను ఎలా అరికట్టాలో తెలుసుకోవడమేకాదు, ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఏంచేయాలో, నష్టం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందుగానే తెలుసుకుంటే ఎంతో మంచిది. దీనికోసం వివిధ‌ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజినీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ -ఫైర్ సేఫ్టీలో డిప్లొమా కోర్సును నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు.
అలాగే ఇగ్నో, ఎన్.ఐ.టి, తిరుచిరాపల్లి, అన్నామలై, తదితర వర్సిటీలు ఫైర్‌సేఫ్టీ కోర్సులను నిర్వహిస్తున్నాయి.
వెబ్‌సైట్‌లు: www.nifsindia.net (or) www.ignou.ac.in
విదేశీ భాషలు
మాతృభాషతోపాటు ఇంగ్లిష్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే ఒకప్పుడు ఉద్యోగానికి అర్హతగా గుర్తించేవారు. సరళీకరణ విధానాలతో ప్రైవేటురంగం బాగా విస్తరించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఖండాతర వ్యాప్తి చెందాయి. విదేశీ సంస్థలు, యూనివర్సిటీలు భారత్‌లో తమ కార్యకలాపాలు ఎక్కువ చేశాయి. ఫలితంగా విదేశీ భాషలు వచ్చిన వారికి అవకాశాలు అందుబాటులోకి రావడం ఎక్కువైంది. విదేశీ భాషలు ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ ఏదైనా కావచ్చు. వీటిని నేర్చుకుంటే చాలు రక్షణ, విదేశీ వ్యవహారాలు, బి.పి.ఒ., కె.పి.ఒ., విద్యారంగాల్లో అపార అవకాశాలున్నాయి.
ఇంటర్ అర్హతతో బి.ఎ. (ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్, చైనీస్, జపనీస్, పర్షియన్, అరబిక్ మొదలైనవి) లో చేరవచ్చు. ఈ కోర్సులను పలు యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.
English and Foreigh Language University(EFLU),Hyderabad.
University, Delhi
Delhi University
సోషల్ వర్క్‌
వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఎదుటి వారి సహాయాన్ని పొందుతారు. కాలం మారేకొద్దీ సేవల రూపురేఖలు, అర్థాలు మారిపోతున్నాయి.
ఇప్పుడు సేవ ఒక వృత్తిగా గుర్తింపు పొందింది. కొద్దోగొప్పో ఆర్థికంగా సంపాదిస్తూ సేవలను అందించడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సేవారంగలో ఎదిగేందుకు అనేక సంస్థలు సోషల్ వర్క్ డిగ్రీలను, పీజీలను అందిస్తున్నాయి.
కోర్సులు:
సోషల్ వర్క్‌లో డిగ్రీ, పీజీ ఇతర ఉన్నత కోర్సులు చేయవచ్చు. ఇంటర్ ఏ గ్రూప్ వారైనా డిగ్రీ కోర్సులో చేరవచ్చు.
కొన్ని శిక్షణ సంస్థలు
రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో బి.ఎ. సోషల్ వర్క్, ఎం.ఎ. సోషల్ వర్క్ కోర్సులున్నాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ముంబయి.
పుణే యూనివర్సిటీ, పుణే. జియాలాజికల్‌సైన్స్
భూమి గురించిన అధ్యయనశాస్త్రమే జియాలాజికల్‌సైన్స్. భూగర్భ పరిశోధనలు చేసే వారిని జియాలజిస్టులు, జియోఫిజిస్టులు, హైడ్రాలజిస్టులు, మెటీరియాలజిస్టులు, జియో కెమిస్టులు అంటారు. భూమిలో ఎన్ని పొరలు ఉన్నాయి? భూ అంతర్గతంగా సంభవిస్తున్న మార్పులేమిటి? ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన భూ భౌతిక వనరులను ఎలా కాపాడాలి లాంటి అనేక అంశాలను జియాలజిస్టులు పరిశీలిస్తారు. జియాలజీలో అనేక యూనివర్సిటీలు వివిధ‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి.
బి.ఎస్‌సి. (జియాలజీ)
బి.ఎస్‌సి. (అప్లయిడ్ జియాలజీ,/ జియోఫిజిక్స్) వీటిని రెగ్యులర్ యూనివర్సిటీల్లో చేయవచ్చు.
ఇంటిగ్రేటెడ్ ఎం.ఎస్‌సి. అప్లయిడ్ జియాలజీ/ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ జియోఫిజిక్స్ (ఐఐటి, ఖరగ్‌పూర్, రూర్కీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్‌బాద్‌ల్లో చదవవచ్చు).
వెబ్‌సైట్‌లు: www.andhrauniversity.info (or) www.ismdhanbad.ac.in