ఉపాధ్యాయ వృత్తిపట్ల ఇష్టం ఉంటే ఇంటర్లో ఏ గ్రూప్ వారైనా డీఈఈ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) సెట్‌కు హాజరు కావచ్చు.
ఇంటర్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ సెట్ రాయటానికి అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు కళాశాలలు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి.
దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే ప్రభుత్వం నిర్వహించే సెకెండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాల పరీక్షకు హాజరవడానికి అర్హత పొందుతారు. ఉత్తీర్ణలైనవారు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందవచ్చు.