telugu kiranam

Education in Australia …. ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం

Education in Australia …. ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం

హోటల్‌ మేనేజ్‌మెంట్ అండ్‌ హాస్పాలిటి.............ఇంజనీరింగ్‌..........ఎం.బి.ఎ. ..........ఫిజియో థెరపి ...........మెడిసన్‌ & లైఫ్‌ సైన్సెస్‌...................ఐటి అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ..............ఏవియేషన్‌ ..............సోర్ట్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్ ........... ఎడ్యుకేషన్‌ అండ్‌ టీచింగ్‌.............మెడికల్‌ రేడియాలజీ
ఆస్ట్రేలియాలో ఇమ్మిగ్రేషన్‌ విభాగం వారు TOFFEL అనుమతించటం లేదు కాబ్టి IELTS పరీక్ష రాయటం తప్పనిసరి దానిలో స్కోరు తక్కువ వచ్చినప్పటికి, ఈ దేశంలో చదవటానికి అర్హత లభిస్తుంది. పరిగణనలోకి తీసుకునే స్కోరు 5. 5.5 జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునేవారు ఆస్ట్రేలియా వైపు మొగ్గుచూపుతారు.
దాడుల నేపధ్యంలో ఈ దేశానికి వెళ్ళేవారి సంఖ్య తగ్గినా ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే విద్యార్థులు చదువుల కోసం ఈ దేశానికి వెళుతున్నారు. ఇక్కడ జనాభా చాలా తక్కువ. రెండున్నర కోట్లు మాత్రమే. భూభాగం మనదేశం కంటే చాలారెట్లే పెద్దది. ఇక్కడి డాలర్‌ సైతం యూ.ఎస్‌. డాలర్‌తో పోటీ పడుతుంది. ఇవన్నీ మనవాళ్లని ఆకట్టుకునే అంశాలే. ఇంజనీరింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐ.టి, వైద్యం చదివేందుకు వెళుతుంటారు.
ఉద్యోగాలకోసం ట్రేడ్‌ వర్కర్స్‌ ప్లంబర్స్‌, ఎలక్ట్రీషియన్స్‌ స్థిరపడేందుకు మొగ్గుచూపుతుంటారు. నిరుద్యోగులకు వారి అర్హతలను బట్టి వెయ్యినుండి ఐదువేలవరకు నాన్‌ ఎంప్లాయ్‌మెంట్ అలవెన్స్‌ ఇక్కడ ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈ దేశంలో అడుగుపెట్టేందుకు నిబంధనలు అంత సులభంగా ఉండవు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఓవర్సీస్ హెల్త్‌ కవర్‌ వుండాల్సిందే. అక్కడ అన్ని మందులు దొరకవు. ఇక్కడనుండి తీసుకు వెళ్ళాల్సిందే.
నాణ్యమైన విద్య మాత్రమే కాకుండా చక్కని జీవనశైలి కావాలనుకునే విద్యార్థులకు గమ్యంగా ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఈ మద్య విద్యారంగంలో ఆస్ట్రేలియా ప్రాభవం కొంత తగ్గినప్పటికీ ప్రాచుర్యం మాత్రం అలాగే ఉంది.
ప్రపంచంలో నివాసయోగ్యమైన ద్రేశాల్లో అత్యుత్తమమైన వాటి జాబితాను తయారుచేస్తే దానిలో ఆస్ట్రేలియా తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. విద్యార్థులు ప్రామాణిక విద్య నేర్చుకోవానికి, విద్యాపరంగా అభివృద్ధి చెందానికి ఆసక్తి ఉంటే వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడానికీ ఆకర్షణీయమైన అవకాశాలున్న దేశమిది. ఇక్కడి వాతావరణం దాదాపు భారత్‌ తరహాలోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదవటానికి ఎక్కువమంది మొగ్గుచూపటానికి ఇదో ముఖ్య కారణం. రాజధాని కాన్‌బెర్రాతో పాటు, సిడ్నీ, మెల్‌బోర్న్‌, బ్రిస్‌ టోన్‌, పెర్త్‌, ఆడిలైడ్‌, డార్విన్‌, హోబర్ట్‌ ఇక్కడి ప్రధాన నగరాలు. ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. అందులోనూ అందమైన తీరప్రాంతం పొడవునా జనజీవనం అధికంగా కనిపిస్తుంది.
ఆస్ట్రేలియా ప్రత్యేకతలు : అక్కడ చదువుకునే విద్యార్థుల్లో వినూత్న ఆలోచనాపథం, సృజనాత్మకత, స్వతంత్ర దృక్పథం పెంపొందుతాయనేది ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయం. బృందంలో పనిచేసే నేర్పు, ప్రభావశీలంగా భావప్రకటన, ప్రాయోగిక నైపుణ్యాలు మేధో సామర్ధ్యం, ఇవన్నీ మెరుగుపరుచుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో నెగ్గుకురాగలం. నాణ్యమైన విద్య మాత్రమే కాకుండా చక్కని జీవనశైలి కావాలనుకునే విద్యార్థులకు గమ్యంగా ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి
ఆధునిక కాలంలో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను నూతన బోథన పద్ధతుల ద్వారా అందిచంటం ఆస్ట్రేలియా ప్రత్యేకత. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, బహుళ సంస్కృతులకు కేంద్రంగా ఉండటం ఇక్కడి విద్యాసంస్థల విశిష్టత. విదేశీ విద్యార్థులు ఎంచుకోవడానికి విస్తృతమైన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. నవీన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి, పరిశోధనలకు వీలు ఏర్పడుతుంది.
ఆస్ట్రేలియా వివిధ సంస్కృతుల కేంద్రం కావటం వలన ఏ దేశానికి చెందినవారైనా ఇక్కడ సర్ధుకుపోగలరు. ఏడాదికి మూడుసార్లు ఆస్ట్రేలియాలో అడ్మిషన్ల సీజన్లు ఉంటాయి. అవి జులై, నవంబరు, ఫిబ్రవరి. అతి పెద్దది జులై ఇన్‌టేక్‌.
ప్రధాన నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో అత్యధికంగా కాస్మాపాలిటన్‌ వాతావరణం కనిపిస్తుంది. అక్కడి జీవనశైలి, ఆహార విహారాలపై అంతర్జాతీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. విదేశీ విద్యార్థులకు ఇది అనుకూలాంశం.
ఆఫ్‌ క్యాంపస్‌లోనూ అవకాశం
అమెరికాలో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలను క్యాంపస్‌లో చేయటానికి మాత్రమే అనుమతిస్తారు. ఆఫ్‌ క్యాంపస్‌లో చేయడం చట్ట వ్యతిరేకం. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలను ఆఫ్‌ క్యాంపస్‌లో కూడా చేసే వీలుంది. విదేశీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే విషయం ఇది. మాస్టర్స్‌ కోర్సు చదివిన తర్వాత రెండేళ్ళ వర్క్‌ పర్మిట్‌ ఇస్తారు.
ఉన్నత స్థాయి బోధన
ఎన్నో అత్యున్నత ర్యాంకులున్న విశ్వవిద్యాలయాలు ఆస్ట్రేలియా ఇక్కడున్నాయి. 41కు పైగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలే ఎక్కువ. చాలా యూనివర్సిటీల బ్రాంచీలకు విదేశాల్లో శాటిలైట్‌ క్యాంపసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ప్రసిద్ధ పరిశోధన కేంద్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల విద్యార్థులకు శ్రేష్ఠమైన విద్యను అందింస్తాయి.
నాలుగు రకాల డిగ్రీ కోర్సులు.....
అండర్‌ గ్రాడ్యుయేట్‌:
ఈ బ్యాచిలర్‌ డిగ్రీల్లో చేరటానికి 18 సంవత్సరాలు నిండివుండాలి. కనీస ఆంగ్ల పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌ లేదా టోఫెల్‌, పీటీఈలో స్కోర్లుండాలి. ఇంటర్లో కనీసం 65 శాతం అవసరం. అయితే 60 శాతం కంటే తక్కువున్నవారు ఫౌండేషన్స్‌, డిప్లొమా ప్రోగ్రాముల్లో చేరవచ్చు. రిసర్చ్‌ మాస్టర్స్‌:
దీనిలో చేరాలంటే బ్యాచిలర్‌ డిగ్రీ (ఆనర్స్‌) లేదా మాస్టర్స్‌ ప్రిలిమినరీ సంవత్సరం, పరిశోధన ఆధారిత గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా తగినంత పరిశోధనానుభవం ఉండాలి.
ప్రొఫెషనల్‌ మాస్టర్స్‌:
బ్యాచిలర్‌ డిగ్రీ, వృత్తిపరమైన అనుభవం లేదా సంబంధిత వృత్తిపరమైన విస్తృత అనుభవం ఉన్నవారు చేరవచ్చు.
టీఏఎఫ్‌ఈ సర్టిఫికెట్లు (ఒకేషనల్‌ శిక్షణ, విద్య):
అత్యంత నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో చేరాలనుకునేవారికి ఈ డిగ్రీలు ఉపయోగం. యూనివర్సిటీ డిగ్రీ చదువులకు కూడా ఇదో ప్రత్యామ్నాయ మార్గం.
స్కిల్డ్‌ ఆక్యుపేషన్‌ లిస్ట్‌ (ఎస్‌ఏఎల్‌)
మారుతున్న సామాజిక ఆర్థిక అవసరాలను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి ఈ జాబితాను తయారుచేసి విడుదల చేస్తారు. దీనిలో ఉన్న కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారికి అర్హతలను బట్టి వీసా సులభంగా మంజూరవుతుంది. సంబంధిత కోర్సుల్లో చదివి అక్కడే స్థిరపడటానికి అవకాశం ఉండటం ఆస్ట్రేలియాలో పెద్ద అనుకూలాంశం.
2017లో రూపొందించిన జాబితాలో పదికి పైగా ఇంజినీరింగ్‌ వృత్తులు చోటుచేసుకున్నాయి. కెమికల్‌, మెటీరియల్స్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, అగ్రికల్చరల్‌, బయోమెడికల్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్లు. ఇతరాలు: ఐసీటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఐసీటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, సిస్టమ్స్‌ అనలిస్ట్‌, అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌, కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఇంజినీరింగ్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌, అకౌంటెంట్‌ (జనరల్‌).
పీజీ....
మాస్టర్స్‌ డిగ్రీ చేయాలంటే ఆస్ట్రేలియన్‌ బ్యాచిలర్‌ డిగ్రీతో సమానమైన అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసివుండాలి. వీరు ఆస్ట్రేలియాలో కోర్సు పూర్తిచేయటానికి ట్యూషన్‌ ఫీజు, దైనందిన ఖర్చుల కోసం తగినన్ని ఆర్థిక వనరులు కలిగివుండటం తప్పనిసరి. మాస్టర్స్‌ చేయటానికి ఏడాదికి 8.20 లక్షల నుంచి 15.36 లక్షల వరకూ యూనివర్సిటీని బట్టి ట్యూషన్‌ ఫీజు ఉంటుంది. ఇక నివాసం, ఇతర దైనందిన ఖర్చులకు 10.39 లక్షలు అవసరం.(2018 లెక్కల ప్రకారం)
విద్యార్థి వీసా పొందటానికి....
ఏడాది ట్యూషన్‌ ఫీజు, జీవన వ్యయం, ప్రయాణ ఖర్చులకు సరిపోను డబ్బున్నట్టు ఆధారాలతోపాటు ఓవర్‌సీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండాలి. - విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం కనీసం 5.12 లక్షల రూపాయిలు ఉన్నట్టు ఆధారాలు చూపాలి.
ప్రతి దరఖాస్తునూ వివరంగా పరిశీలిస్తారు. సంతృప్తికరంగా తగిన సమాధానాలు ఇస్తే వీసాను మంజూరు చేస్తారు.
ఇంగ్లిష్‌ భాషా పరీక్షలు
ఆస్ట్రేలియాలో ఆంగ్లంలో బోధించే ప్రోగ్రాములు 60 వేలకు పైగా ఉన్నాయి. అందుకే అక్కడి యూనివర్సిటీలు తమ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు మంచి ఆంగ్ల భాషా సామర్థ్యాలుండాలని ఆశిస్తాయి. అన్ని విశ్వవిద్యాలయాలూ అధికారికమైన మూడు ఆంగ్ల పరీక్షల స్కోర్లను ఆమోదిస్తాయి. వీటిలో ఏదో ఒక దానిలో స్కోరు ఉండాలి. దీ ఐఈఎల్‌టీఎస్‌ (అకడమిక్‌ మాడ్యూల్‌): ఓవరాల్‌ స్కోరు 6.5 (బ్యాండ్‌ కనీసం 6.0) దీ టోఫెల్‌ ఇంటర్నెట్‌: టెస్ట్‌ స్కోరు 79. సెక్షన్లవారీగా కనీసం ఉండాల్సిన స్కోర్లు: లిసనింగ్‌: 19, స్పీకింగ్‌: 19, రీడింగ్‌: 18, రైటింగ్‌: 22 దీ పియర్సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (పీటీఈ): ఓవరాల్‌ స్కోరు 50-64 (సెక్షన్‌వారీ స్కోరు కనీసం 46-58) ఏ కోర్సులకు ప్రాధాన్యం : హోటల్‌ మేనేజ్‌మెంట్ అండ్‌ హాస్పాలిటీ, ఇంజినీరంగ్‌, ఎం.బి.ఎ. ఫిజియోధెరపీ, మెడిసన్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఐ.టి, అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఏవియేషన్‌, స్పోర్ట్స్‌ మరియు స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్ , ఎడ్యుకేషన్‌ అండ్‌ టీచింగ్‌, మెడికల్‌ రేడియాలజీ.
మనదేశ విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా చేరుతున్న కోర్సులు బిజినెస్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, సైన్స్‌ హాస్పిలిటీ, మొదలైనవి. ఇక్కడ విద్యార్థులకు అత్యధిక అవకాశాలు అందించే డిగ్రీ కోర్సులు.. బిజినెస్‌ కోర్సుల నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, ట్రేడ్స్‌, ఎడ్యుకేషన్‌ వరకూ అన్ని స్థాయిల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా విద్యా సంస్థలు అందించే డిగ్రీలను అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ గుర్తిస్తోంది. దీనివల్ల ఏ భారతీయ విశ్వవిద్యాలయంలోనైనా తర్వాతి చదువులకూ ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్ట్రేలియా వ్యాప్తంగా వివిధ వొకేషనల్‌ విద్య, శిక్షణ కళాశాలల్లో చాలామంది విదేశీ విద్యార్థులు చెరుతున్నారు. నాణ్యమైన విద్యాసంస్థలూ, కోర్సులు అందుబాటులో ఉండానికి అక్కడి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం విద్యాసంస్థలన్నీ అక్రిడిటేషన్‌ పొందివుండాలి. అంతార్జతీయ విద్యార్థులకు అందించే కోర్సులన్నీ తప్పని సరిగా అనుమతి పొందివుండాలి. కామన్‌వెల్త్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ కోర్సెస్‌ ఫర్‌ ఓవర్‌సీస్‌ స్టూడెండ్స్‌లో లిస్టయివుండాలి. విద్యార్థులకు అందించే అర్హతలు ఆస్ట్రేలియన్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌కు తగివుండాలి.
ప్రవేశానికి ఏం కావాలి? కోర్సుల అవసరాలను బట్టి వివిధ దేశాలు, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఒక్కోరకమైన ప్రవేశ అర్హతను నిర్ధేశిస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశంలో ఇమిగ్రేషన్‌ విభాగాం వారు టోఫెల్‌ను అనుమతించటం లేదు. కాబట్టి ఇక్కడ చదవదలిచిన విద్యార్థులు IELTS పరీక్ష రాయటం తప్పనిసరి. దానిలో స్కోరు తక్కువ వచ్చినప్పటికీ ఈ దేశాల్లో చదవటానికి ప్రవేశం లభిస్తుంది. పరిగణనలోకి తీసుకునే స్కోరు : 5-5.5. ఇన్‌టేక్స్‌ : ఇక్కడ ఇన్‌టేక్‌ రెండు సీజన్లలో జరుగుతుంది. ఇక్కడి విద్యాసంస్థల ప్రధానమైన ఇన్‌టెక్‌ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి/మార్చి తొలిభాగంలో జరుగుతుంది. జులై/ఆగస్టు నెలల్లో మరో ఇన్‌టేక్‌ ఉంది. కోర్సుల్లో ఈ ఇన్‌టేక్‌లో కూడా ఎక్కువమందే చేరతారు. మే, అక్టోబరు, నవంబరుల్లో ప్రారంభమయ్యే కోర్సులు కూడా ఉన్నాయి.
. ఉపకారవేతనాలు : ఎక్కువమంది అంతర్జాతీయ విద్యార్థులు పూర్తి ఫీజును చెల్లించేవారే అయితే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఇతర సంస్థలెన్నో ఉపకారవేతనాలు అందిస్తున్నాయి. వొకేషనల్‌ విద్య శిక్షణ, స్టూడెండ్‌ ఎక్సేంజెస్‌, అండర్‌ గ్రాడ్యుయేట్ పీజీ స్టడీ రిసర్చ్‌లలో ఈ వెసులుబాటు లభిస్తుంది.
ధరఖాస్తు సమయంలో : ఆస్ట్రేలియా విద్యాభ్యాసం కోసం చేసే దరఖాస్తుల్లో సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు జాబితా : బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్టర్‌ (యూనివర్సిటీ) టెన్త్‌ (ప్రిన్సిపల్‌ అటెస్టు చేసినది సీల్డ్‌ కవర్లో) 10+2 /డిప్లోమో (ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేసినది సీల్డ్‌ కవర్లో). బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ విడి మార్క్‌ షీట్లు. కన్సాలిడిడేటెడ్‌/ప్రొవిజనల్‌/ డిగ్రీ/కోర్సు కంప్లీషన్‌.IELTS స్కోరు. రికమెండేషన్‌ లెటర్‌ (అవసరమైతే) స్టేట్ మెంట్ ఆఫ్‌ పర్పస్‌ (అవసరమైతే). లేదా రెస్యూమ్‌. ఎక్ప్‌పీరియన్స్‌ లెటర్‌ (ఉంటే). పాస్‌పోర్ట్‌ జెరాక్స్‌ (తొలి, చివరి పేజీలు) ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ సర్టిఫికెట్ల (ఉంటే). పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో
ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ విద్యారంగ నాణ్యత, పోటీలను పెంచేందుకు విద్యార్ధి వీసా ప్రోగ్రాంను సమీక్షించడానికి డిసెంబర్‌ 2010లో అక్కడి ప్రభుత్వం మైకేల్‌ నైట్ ను నియమించింది. ఆ సమీక్షకు సంబంధించిన మొత్తం 41 సిఫార్సులను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదించింది.
సిఫార్సులలో కొన్ని : బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన ఫైనాన్సియల్‌ రిక్వైర్‌మెంట్ 70-80 వేల డాలర్లనుండి 36,000 డాలర్లకు తగ్గించింది. క్రితం విద్యార్థులు ఖాతాలో చూపించే నిధులు 3 నెలల క్రితంవి అయి ఉండాలి. ప్రస్తుతం తాజా డిపాజిట్లు కూడా చెల్లుతాయి. ఇంకా మిగతా పూర్తి వివరాలకోసం ఈ క్రింది సైట్ ను దర్శించండి.
www.immi.gov.au/students/_pdf/2011-knight-review.pdf