Canada…Education....
నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలపరంగా విద్యార్థులు ఈ దేశంలో చదవటానికి మొగ్గు చూపుతున్నారు.
కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి.
ప్రశాంతమైన వాతావరణం, ప్రామాణిక విద్యతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ర్యాంకింగ్ పొందిన విశ్వవిద్యాలయాలు కెనడా విశిష్టతలు. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 1,80,000 మంది విద్యార్థులు ఇక్కడికి విద్యాభ్యాసానికి వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్నవారి సంఖ్యా వేలల్లో ఉంది.
విశ్వవిఖ్యాతి చెందిన 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో 10% ఇక్కడే ఉన్నాయి. 2019గానూ క్యూఎస్ నిర్వహించిన ‘వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ’ల్లో కెనడాకు చెందినవే 26కుపైగా ఉన్నాయి. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ రంగాల్లో పరిశోధనాత్మక బోధనతో కూడిన ప్రోగ్రామ్‌లు ఆకర్షిస్తున్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజు సుమారుగా రూ.13.45 లక్షలు, పీజీ కోర్సులకు రూ. 8.68 లక్షలు, ఎంబీఏకు రూ.15.65 లక్షలు, ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్) కోర్సుకు రూ.27.72 లక్షలు ఉంటుంది. ఎంచుకున్న ప్రదేశాన్ని
బట్టి దైనందిన ఖర్చుల్లో తేడాలుంటాయి. సాధారణంగా నగరాన్ని బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 42,730 నుంచి రూ. 64,100 వరకూ అవుతాయి. పెద్ద పట్టణాల్లో అయితే నెలకు రూ.55,000 నుంచి రూ.66,000 వరకూ ఉంటుంది.
కానీ యూనివర్సిటీలో నివాస సదుపాయం ఏర్పరచుకున్నవారికి తక్కువ ఖర్చు అవుతుంది.
(calucations…as per 2018)
కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులకు ఎక్కువ గిరాకీ ఉంది. చాలామంది హెల్త్‌కేర్, ఒకేషనల్ కోర్సులను చేయడానికీ ఆసక్తి చూపుతున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, మెడిసిన్ సంబంధిత కోర్సులు, జాగ్రఫీ, మేథమేటిక్స్‌లకూ డిమాండ్ ఉంది.
ఇక్కడ 100కుపైగా యూనివర్సిటీలున్నాయి. ఒక్కో కోర్సుకు ఒక్కో యూనివర్సిటీ పేరు. వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం అయితే..
యూనివర్సిటీ ఆఫ్ టోరంటో
యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ
యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా
మెక్‌గిల్ యూనివర్సిటీ
మెక్ మాస్టర్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్
యార్క్ యూనివర్సిటీ ప్రముఖమైనవి. పబ్లిక్ ఫండెడ్, ప్రైవేటు రెండు రకాల విద్యాసంస్థలున్నాయి. మొత్తంగా నాలుగు రకాల విద్యాసంస్థలు- టెక్నికల్/ కెరియర్ కాలేజీలు, కమ్యూనిటీ కాలేజీలు అండ్ టెక్నికల్ సంస్థలు,
యూనివర్సిటీ కళాశాలలు, యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి.
ఏటా మూడు సార్లు (ఫాల్, స్ప్రింగ్, సమ్మర్ ఇన్‌టేక్స్) విద్యార్థులను తీసుకుంటారు. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఫాల్ ఇన్‌టేక్ సెప్టెంబరులో మొదలై డిసెంబరు వరకూ సాగుతుంది. దీనిలో చేరనివారు స్ప్రింగ్ (వింటర్) ఇన్‌టేక్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిలో తరగతులు జనవరిలో ప్రారంభమై, సెమిస్టర్ మే వరకూ కొనసాగుతుంది. ఇక ఏప్రిల్- మే నెలల్లో మొదలయ్యే సమ్మర్ ఇన్‌టేక్‌లో పరిమితమైన కళాశాలలూ, కోర్సులూ మాత్రమే ఉంటాయి. చాలా కళాశాలలు ఏడాది పొడవునా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం.
దరఖాస్తు ప్రక్రియ కనీసం ఆరు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుంది. మంచి సంస్థలో ప్రవేశం పొందాలనుకునేవారు తరగతులు ప్రారంభం కావడానికి కనీసం 10-12 నెలల ముందే దరఖాస్తు చేసుకోవాలి. చాలావరకూ కోర్సులు, ప్రోగ్రామ్‌లు
ఫాల్ ఇన్‌టేక్‌లో ఉన్నవి స్ప్రింగ్ ఇన్‌టేక్‌లో ఉండాలనేం లేదు. కాబట్టి, దరఖాస్తు చేసుకోవడానికి ముందు కోరుకున్న కోర్సు అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి.
సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్. బ్యాచిలర్ డిగ్రీ/ అడ్వాన్స్‌డ్ డిప్లొమా/ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు చదవడానికి సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసినవారు అర్హులు. మాస్టర్
డిగ్రీ, పీజీ సర్టిఫికెట్/ డిప్లొమా చదవడానికి 16 ఏళ్ల విద్య లేదా బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. బిజినెస్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధిత రంగంలో 2-3 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
చదువు పూర్తయ్యాక అదే దేశంలో స్థిరపడాలనే కోరిక చాలామందిలో కనిపిస్తోంది. ఏటా ఈ దేశం రెండు లక్షల మందికి ఇమిగ్రేషన్ అవకాశం కల్పిస్తోంది. 15 నుంచి 18 నెలలు ఇక్కడ ఉన్నవారెవరైనా పర్మనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీస అర్హత పాయింట్లు- 67ను సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ స్థిరపడాలనుకునేవారికి రెండు అవకాశాలున్నాయి.
1. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్కీం: కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్కీం (సీఈఈ)లో తగిన నైపుణ్యాలు, పని అనుభవం ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు/ నిపుణులు స్థిరపడవచ్చు. ఇందుకు కావాల్సిన ప్రధాన అర్హత- ఇక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకోడానికీ, దేశ ఆర్థికవ్యవస్థకు సాయపడటానికీ సుముఖంగా ఉండటం. నైపుణ్యాలు, విద్య, భాషా సామర్థ్యం, పని అనుభవం, ఇతర అంశాల ఆధారంగా కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (సీఆర్‌ఎస్) పాయింట్లు ఇస్తారు. కనీసం 440 పాయింట్లు ఉంటే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయినవారికి అదనపు పాయింట్లు లభిస్తాయి.
2. పీజీ వర్క్ పర్మిట్: స్థానిక సంస్థ నుంచి డిగ్రీ లేదా ప్రోగ్రామ్ స్టడీ చేస్తున్నవారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అందుబాటులో ఉంటుంది. ఈ తరహా వర్క్ పర్మిట్ నిర్ణీత మొత్తంలో పనిచేసిన తరువాత కెనడియన్ పర్మనెంట్ రెసిడెన్సీగా మార్పు చెందుతుంది.
విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేయటానికి విదేశీ విద్యార్థుల కోసం ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్’ (ఎస్‌డీఎస్) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
దీనివల్ల ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ తగ్గటమే కాకుండా వీసా ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుంది. ఎస్‌డీఎస్ ప్రకారం... విద్యార్థులకు ఐఈఎల్‌టీఎస్ స్కోరు 6.5 ఉండాలి. వీరు ఏడాదికయ్యే దైనందిన జీవన వ్యయం (దాదాపు రూ.5.34 లక్షలు) మొత్తాన్నీ, ఏడాది కాలపు ట్యూషన్ ఫీజునూ బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేయాల్సివుంటుంది.
విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఇక్కడి క్యాంపస్‌లు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. విశ్వవిద్యాలయాలు, సంస్థలు రోజు పొడవునా అందుబాటులో ఉండే సొంత సెక్యూరిటీ వ్యవస్థను కలిగివున్నాయి. అర్హత గల విద్యార్థి తన ఆసక్తి మేరకు క్యాంపస్‌లోగానీ, ఆఫ్‌క్యాంపస్‌లోగానీ పని చేసి, ఆదాయం పొందవచ్చు. వారానికి 20 గంటల చొప్పున, సెమిస్టర్ సెలవుల్లో ఫుల్ టైం ఉద్యోగాలను చేసుకునే వీలుంది. అయితే వీరు వర్క్ పర్మిట్ పొందడం తప్పనిసరి. క్యాంపస్‌లో పని చేయాలనుకునే వారికి మాత్రం అవసరముండదు. ఫుల్ టైం విద్యార్థులై ఉండాలి.
ప్రామాణిక పరీక్షల స్కోరు
కెనడాలోని అన్ని కోర్సులకూ ఈ స్కోరు తప్పనిసరి. ఎస్‌డీఎస్ స్కీం కింద కనీసం 6.5 స్కోరు సాధించాల్సి ఉంటుంది. కోర్సునుబట్టి అడిగే స్కోరులో మార్పు ఉంటుంది.
కొన్ని సంస్థలు ఈ స్కోరును అంగీకరిస్తున్నాయి. సాధించాల్సిన కనీస స్కోరు 80.
ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ అకౌంటెన్సీ, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునేవారికి ఈ స్కోరు తప్పక ఉండాలి. అడ్మిషన్ పొందాలంటే కనీసం 500కుపైగా స్కోరు సాధించి ఉండాలి.
తప్పనిసరేం కాదు. కొన్ని సంస్థలు మాత్రం ఈ స్కోరును అడుగుతున్నాయి. బిజినెస్, ఇతర మాస్టర్స్ ప్రోగ్రాములకు ఎక్కువగా ఈ స్కోరును అడుగుతున్నారు. టెక్నలాజికల్ కోర్సులకు మాత్రం 300కుపైగా స్కోరు ఉండాలి.