header

Foreign Education - Education in France / ఫ్రాన్స్ లో విద్యావకాశాలు

Foreign Education - Education in France / ఫ్రాన్స్ లో విద్యావకాశాలు

ఉన్నత విద్య, పరిశోధనల్లో శ్రేష్ఠతకు ఫ్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. ఆర్కిటెక్చర్, పొలిటికల్ సైన్స్, లా, జర్నలిజం, డిజైన్, మేనేజ్మెంట్ స్టడీస్, టెక్నాలజీ, ఫ్యాషన్ మొదలైన విభిన్న సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.
అండర్గ్రాడ్యుయేట్ విద్య: ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాల్లో యూజీ డిగ్రీ వ్యవధి మూడేళ్ళు. విద్యాసంవత్సరం సాధారణంగా సెప్టెంబరు మధ్య నుంచి తర్వాతి ఏడాది జూన్ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. కొన్ని విద్యాసంస్థలు ఏడాది పొడవునా ప్రవేశాలు కల్పిస్తాయి.
పోస్టుగ్రాడ్యుయేట్ విద్య: ఇక్కడ పీజీ ప్రోగ్రాములు మూడు రకాలుగా ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ వ్యవధి 2 నుంచి 3 సంవత్సరాలుంటుంది.
1) టాట్ మాస్టర్స్ (ఎంఏ, ఎమ్మెస్సీ)
2) రిసెర్చ్ మాస్టర్స్ (ఎంఎ బై రిసెర్చ్)
3) డాక్టరేట్స్ అండ్ పీహెచ్డీస్. ప్రవేశాలకు సంబంధించి ఫాల్ ఇన్టేక్ సెప్టెంబరులోనూ, స్ప్రింగ్ ఇన్టేక్ జనవరిలోనూ ఉంటుంది.
ఖర్చు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖర్చు చాలా తక్కువ. ఇది కనిష్ఠంగా రూ. 14,030, గరిష్ఠంగా రూ. 46,500 వరకూ ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో ముఖ్యంగా బిజినెస్ స్కూళ్ళలో ఖర్చు అధికం. దీని ఖర్చు శ్రేణి ఏడాదికి రూ. 2,28,750 నుంచి రూ. 7.6 లక్షల వరకూ ఉంటుంది.
పనిచేసే అవకాశాలు: అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 20 గంటల చొప్పున ఏడాదికి 964 గంటలు పనిచేయవచ్చు. గంటకు కనీసం 9.76 యూరోలను సంపాదించటానికి వీలుంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక విద్యార్థులు టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్పై సంవత్సరం పాటు ఫ్రాన్స్లో నివసించవచ్చు. వారికి ఉద్యోగం లభిస్తే దాన్ని పొడిగించే అవకాశం ఉంది.
Some Famous Universities/ Colleges in France
Ecolp Polytechnic
Pear and Marycury Versity
Paris Sood University
Ecoli Normal Superior Di Liyan
Paris Sciences at Letters PSL Research Versity