header

Education Abroad, Education in Italy / ఇటలీలో విద్యాభ్యాసం....

Education Abroad, Education in Italy / ఇటలీలో విద్యాభ్యాసం....
సాంకేతికతలో మౌలిక పరిశోధనలు ఇటలీ ప్రత్యేకత. ఉన్నతవిద్యలోని ప్రతి రంగంలో.. ముఖ్యంగా డిజైనింగ్, ఆర్కిటెక్చర్, అప్లయిడ్ సైన్సెస్, ఆర్ట్స్ల్లో ఈ దేశం అగ్రగామిగా సాగుతోంది. అండర్గ్రాడ్యుయేట్ విద్య:
సాధారణంగా ఇక్కడ బాచిలర్ డిగ్రీని డిగ్రీ కోర్సుగా పిలుస్తారు. దీని కాలవ్యవధి 3 సంవత్సరాలు. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో విద్యాసంవత్సరం అక్టోబరులో ప్రారంభమవుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య: మాస్టర్స్కు రెండేళ్లు, పీహెచ్డీకి మూడేళ్లు. విద్యాసంవత్సరం ఆరంభం- అక్టోబరులో.
ఖర్చు: యూరప్లోని ఇతర దేశాలతో పోలిస్తే ఇటలీలో ట్యూషన్ ఫీజు తక్కువ. బాచిలర్, మాస్టర్ ప్రోగ్రాములకు ఫీజు సరాసరిగా ఏడాదికి రూ. 61,000 నుంచి రూ.1,14,000 (2017) వరకూ ఉంటుంది. ఇక్కడి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం చాలా ఖరీదైనవి. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపకార వేతనాల సౌకర్యం ఉంది.
ఉద్యోగావకాశాలు
అంతర్జాతీయ విద్యార్థులు ఒక వారానికి 20 గంటలపాటు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు టెంపరరీ స్టే పర్మిట్ కింద ఆరు నెలల నుంచి ఏడాదిపాటు ఉండవచ్చు. ఫ్రాన్స్, జర్మనీ మొదలైన ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు మాత్రం చాలా తక్కువ.
Some Famous Universities/ Colleges in Italy
Scuvola Normal Superior Di Peasa
University of Bologna
Veeta Salut San Rafel University
University of Trento
Skuvola Superior Santanna