ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశోధన సౌకర్యాలు జపాన్ విశిష్టత. చాలా జపనీస్ విశ్వవిద్యాలయాలు కొన్ని నిర్ణీత అంశాల్లోని కోర్సులను ఆంగ్లంలోనే అందిస్తున్నాయి. ఇక్కడ ఒక్కో ప్రోగ్రామ్కు అయ్యే ఖర్చు యూకే/ యూఎస్ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే ఎక్కువే.
ఇక్కడ జాతీయ, ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలున్నాయి. అండర్గ్రాడ్యుయేషన్ కాలవ్యవధి 4 సంవత్సరాలు. కానీ మెడిసిన్, డెంటిస్ట్రీ, వెటర్నరీ సైన్స్ డిపార్ట్మెంట్ల విషయానికొచ్చేసరికి ఇది ఆరు సంవత్సరాలు.
గ్రాడ్యుయేట్ స్కూల్లో విద్యను పూర్తిచేయడానికి పట్టే సమయం విద్యార్థి ఎంచుకున్న (మాస్టర్స్ ప్రోగ్రామ్/ డాక్టర్స్ ప్రోగ్రామ్) ప్రోగ్రామ్ను బట్టి ఉంటుంది. మాస్టర్ ప్రోగ్రామ్కు అయితే రెండేళ్లు, డాక్టర్స్ ప్రోగ్రామ్స్కు అయితే అయిదేళ్ల సమయం పడుతుంది. జపనీస్ స్కూళ్ల విద్యాసంవత్సరం సాధారణంగా ఏప్రిల్తో మొదలై మరుసటి ఏడాది మార్చితో ముగుస్తుంది. కొన్ని తరగతులు సంవత్సరం పొడవునా నడుస్తాయి. మరొకొన్ని సెమిస్టర్లుగా విడిపోయి మొదటి సెమిస్టర్ ఏప్రిల్- సెప్టెంబరు వరకూ, రెండో సెమిస్టర్ అక్టోబరు నుంచి మార్చి వరకూ ఉంటాయి. సాధారణంగా విద్యార్థులు ఏప్రిల్లో తమ దరఖాస్తులు పంపి, పేర్లు నమోదు చేసుకుంటారు. కొన్ని సంస్థలు అక్టోబరు సమయంలోనూ ప్రవేశాలకు అనుమతిస్తాయి.
అండర్ గ్రాడ్యుయేట్స్కు ట్యూషన్ ఫీజు కనీసం రూ.4,53,000 నుంచి రూ.32 లక్షల వరకూ ఉంటుంది. గ్రాడ్యుయేట్లకు రూ.4,62,000 నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుంది.(2017 సంవత్సరంలో ఖర్చులను అనుసరించి)
కాలేజ్ స్టూడెంట్ వీసాతో పనిచేసే అర్హత విద్యార్థులకు ఉండదు. ఒకవేళ వారు ఎక్కడైనా పనిచేయాలనుకుంటే వర్క్ పర్మిట్ నిమిత్తం ఇమిగ్రేషన్ బ్యూరోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఈ పర్మిట్ను రెసిడెన్స్ స్టేటస్గా ఇచ్చేవారు. ఇప్పుడు పని నిమిత్తం ఇస్తున్నారు. ఈ పర్మిట్ ఆమోదం పొందితే వారానికి 28 గంటలు పనిచేసుకునే వీలుంటుంది. ఒకసారి చదువు పూర్తయ్యాక విద్యార్థి టెంపరరీ రెసిడెన్స్ స్టేటస్పై ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉండవచ్చు. ఒకవేళ ఉద్యోగాన్ని పొందితే, వీసాను పొడిగించుకోవచ్చు.
University of Tokyo
Thohoko University
Kyoto University
Nagoya University
Tokyo University of Technology