header

Foreign Education - Education in Netherlands / నెదర్లాండ్స్ లో విద్యావకాశాలు

Foreign Education - Education in Netherlands / నెదర్లాండ్స్ లో విద్యావకాశాలు
పందొమ్మిదో శతాబ్దం మొదటి నుంచీ నెదర్లాండ్స్ విద్యాసంస్థలు ప్రాచుర్యం పొందుతూవచ్చాయి. ఈ దేశంలోని విద్యాసంస్థల్లో ఎకనామిక్స్ అండ్ బిజినెస్, హ్యూమన్ అండ్ సోషల్ సైన్సెస్, ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో విదేశీ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్య
నెదర్లాండ్ విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ కాలవ్యవధి 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. విద్యాసంవత్సరం సెప్టెంబర్ మధ్య నుంచి ప్రారంభమై మరుసటి ఏడాది జూన్తో ముగుస్తుంది. కొన్ని సంస్థలు ఏడాది పొడవునా ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య
మాస్టర్ డిగ్రీ కాలవ్యవధి 1 నుంచి 4 సంవత్సరాల వరకూ ఉంటుంది. వీటిల్లో ప్రవేశాన్ని పొందాలంటే 6-8 నెలల ముందస్తు దరఖాస్తు తప్పనిసరి. సెప్టెంబర్లో మొదలయ్యే ఫాల్ ఇన్టేక్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఖర్చు (2017)
ట్యూషన్ ఫీజు తక్కువ, జీవనానికి అయ్యే ఖర్చు ఇంకా తక్కువ. బాచిలర్ ప్రోగ్రామ్కు అయ్యే ఖర్చు సరాసరి రూ. 4,57,560 - రూ.11,43,750 మధ్య అవుతుంది. మాస్టర్ ప్రోగ్రామ్లకు అయితే రూ.6,10,000 - రూ.15,25,000 అవసరం. అంతర్జాతీయ విద్యార్థులకు ఇక్కడి విశ్వవిద్యాలయాలు చాలారకాల ఉపకార వేతనాలను అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు
ఏప్రిల్ 2017 నుంచి అందరు విద్యార్థులూ తమ చదువుతోపాటు పార్ట్టైం జాబ్ను వారానికి 10 గంటల చొప్పున పనిచేసే అవకాశముంది. స్వయం ఉపాధికి పనిగంటల నిబంధన వర్తించదు. ఓరియెంటేషన్ ఇయర్ పథకం ప్రకారం.. నెదర్లాండ్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుంటే పనిచేయడానికైనా, సొంత సంస్థను ఏర్పాటు చేసుకోవడానికైనా వర్క్ పర్మిట్ అవసరం లేదు. Some Famous Universities/ Colleges in Netherlands
University of Amsterdam
Defeft University of Technology
Vagininjen University and Research
Leaden University
Utrecht University

<