ఇక్కడి విద్యావకాశాలు యూఎస్ మాదిరిగానే ఉంటాయి. మెడిసిన్ చదవడానికి ఉన్న మంచి అవకాశాల్లో కరేబియన్ ఒకటి. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరీ (ఐఎండీ)లో నమోదైన ఎన్నో మెడికల్ స్కూళ్లను కలిగి ఉండటంతో.. దేశీయ కళాశాలలకు ప్రత్యామ్నాయాలను వెదుకుతున్నవారికి ఇదో ఎంచుకోదగ్గ గమ్యమైంది.
ఇక్కడి వైద్య విద్యాసంస్థలు చాలావరకూ అమెరికా, కెనడా తరహా పాఠ్యాంశాల ఆధారంగానే బోధిస్తాయి. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ (యూఎస్ఎంఎల్ఈ)లో అనేక విభాగాల్లో అర్హత సాధించేలా విద్యార్థిని తీర్చదిద్దడానికి అమెరికా వైద్య విద్యాసంస్థలు అనుసరించే విధానం, ఫిజీషియన్లుగా స్థిరపడటానికి ముందు అర్హత సాధించాల్సిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ (ఎంసీసీక్యూఈ) విధానాలనే కరేబియన్ విద్యాసంస్థలూ అనుసరిస్తాయి. చాలామంది విద్యార్థులు కరేబియన్ మెడికల్ స్కూళ్లలో చదవడానికి మొగ్గు చూపడానికి కారణం- యూఎస్, కెనడియన్ మెడికల్ స్కూళ్లతో పోలిస్తే ఇక్కడ ఖర్చు, పోటీ తక్కువ. కొన్ని స్కూళ్లు కోర్సు వ్యవధిలోని మూడు, నాలుగు సంవత్సరాల్లో క్లినికల్ రొటేషన్ కింద యూఎస్ ఆస్పత్రుల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఇక్కడ ఫీజు అమెరికన్ మెడికల్ స్కూళ్ల ఫీజులో నాలుగో వంతు మాత్రమే. యూఎస్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీనికి విలువ ఉంది. మొత్తం వైద్యవిద్యా కోర్సుకు సగటున రూ. 68 లక్షల నుంచి రూ. 1.3 కోట్ల వరకూ ఉంటుంది.
కోర్సు పూర్తయ్యాక విద్యార్థులు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ, చాలామంది విద్యార్థులు యూఎస్కు వెళ్లడానికి మొగ్గు చూపుతారు. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు తక్కువ. అయినప్పటికీ ఇక్కడ చదవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య తక్కువ కాబట్టి, సులువుగా సీటు దక్కించుకోవచ్చు.
Raas University
Saba University
American Univrsity of the Karebiyan School of Medicine
American University of Antigwa
Saint Georges University, Grenada