header

Arunachalam….అరుణాచలం

Arunachalam….అరుణాచలం

గిరి ప్రదక్షణ అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గిరి ప్రదక్షణకు చాలా వరకు తారురోడ్డు ఉంది. ప్రక్కనే ఫుట్‌పాత్‌ కూడా ఉంది. ఉదయం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేకువ జామున గానీ, రాత్రి గానీ గిరి ప్రదక్షణ చేస్తారు. గిరి ప్రదక్షణాన్ని శ్రీ రమణమహర్షి ఆశ్రమంనుండి ప్రారంభించి దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తారు. మధ్యలో పాళెతీర్ధం, గళశగుడి, అగస్త్యతీర్ధం, ద్రౌపదీ గుడి, స్కంధాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణ తీర్ధం, నైరుతీ లింగం, హనుమాన్‌ గుడి, ఉణ్ణావలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్ధం, రామలింగేశ్వరాయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల, రాజరాజేశ్వరీ ఆలయం, గౌతమ ముని ఆశ్రమం, పూర్యలింగం, వరుణలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకా మాత ఆలయం, వాయిలింగం, అక్షరమండపం, ఈశాన్యలింగం, ప్రవాళపర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమంను దర్శించచవచ్చు. గిరి ప్రదక్షణ మొత్తం దూరం 14 కి.మీ.
కార్తీక పౌర్ణమినాడు ఇక్కడ భారీ వేడుక జరుగుతుంది. మూడు టన్నుల ఆవునెయ్యితో కొండమీద పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. దక్షిణభారతంలో వెసిన పంచలింగాలలో అరుణాచలం అగ్నిక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది.
పంచభూత లింగాలు
అరుణాచం - అన్నామలైశ్యరుడు - అగ్నిలింగం
జంబుకేశ్వరం - జంబుకేశ్వరుడు - జలలింగం
ఏకాంబరేశ్వరుడు - కంచి - పృద్వీలింగం
శ్రీకాళహస్తి - శ్రీకాళహస్తీశ్వరుడు - వాయిలింగం
అరుణాచల దేవాలయ విశిష్టతలు ఈ దేవాలయానికి నాలుగు ప్రక్కలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు నాలుగు రాజగోపురాలున్నాయి. పాతాళ లింగం, పెద్దనంది, వేయి స్థంబాల మండపం కలవు.
కిలిగోపురం (చిలక గోపురం) అరుణగిరినాధర్‌కు సంబంధించినది ఇది. గోపురంపై చిలకను చూడవచ్చు. అరుణగిరి నాధుడు చిలకరూపంలో ఇక్కడ ఉండిపోయాడంటారు. దీనిని భళ్ళాల మహారాజు కట్టించాడంటారు.
తమిళనాడులోని దేవాలయాలన్నీ మధ్యాహ్నం గం.12-30 మూసివేస్తారు. తిరిగి సాయంత్రం గం.4-00గంటలకు తెరచి 8-30 లేక 9-00 గం.కు మూసివేస్తారు.
గిరి ప్రదక్షణ చేయు భక్తులకు సూచనలు 14 కి.మీ. గిరి ప్రదక్షణ చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షణ చేయు సమయంలో బరువైన సామాన్లు, సంచులు లేకుండా వెళితే ప్రయాణం సునాయాసంగా ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షణ కష్టంగా ఉంటుంది. ఎండ మరియు ట్రాఫిక్‌ సమస్యలు ఉంటాయి.
గిరి ప్రదక్షణ ఉదయం 9 గంటలలోపు గాని రాత్రి పూటగాని, తెల్లవారు జామున గాని చేయటం మంచిది. పౌర్ణమి రోజున ఎక్కువ మంది గిరి ప్రదక్షణ చేస్తారు. కనుక కొత్తవారు ఆరోజున గిరి ప్రదక్షణ చేయటం మంచిది. గిరి ప్రదక్షణ చేసేటప్పుడు చిల్లర తీసుకుపోవటం మర్చిపోవద్దు.
రమణమహర్షి ఆశ్రమం అరుణాచలేశ్వర దేవాలయానికి 2 కి.మీ దూరంలో రమణమహర్షి ఆశ్రమంను చూడవచ్చు. విదేశీయులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.ఆశ్రమానికి సాయంత్రం వేళలో వెళితే ప్రార్థనలో పాల్గొని రమణల వారి సమాధి చూడవచ్చు. ఆశ్రమంలో కోతులు, నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి.
ప్రయాణసదుపాయాలు చెన్నై నుండి అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) 189 కి.మీ దూరంలో ఉంది. చెన్నై సెంట్రల్‌ నుండి రైలు లేక బస్సులలో వెళ్లవచ్చు.
అరుణాచలేశ్వరుని దివ్వనామావళి తరువాత పేజీలో..క్లిక్ చేయండి....