
Jogulamba Temple..Jogulamba Shakti Peetam…జోగులాంబా శక్తిపీఠం - ఆలంపూర్
అష్టాదశ శక్తిపీఠాలలో జోగులాంబా శక్తిపీఠం ఒకటి. ఈ పవిత్రశక్తి పీఠం మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో ఉన్నది.
జోగులాంబా దేవాలయం 14వ శతాబ్ధంలో బహమనీ సుల్తానులచే నాశనం చేయబడినది. జోగులాంబ మరియు చండీ ముండీ విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఉంచి 2005 సంవత్సరం వరకు కాపాడబడినవి. తరువాత ఈ ఆలయం తిరిగి నిర్మించబడినది. చండీ ముండీ దేవత విగ్రహాలు బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలోనే ఉంచబడి జోగులాంబ ప్రక్కనే కొత్తగా తయారు చేసిన విగ్రహాలు ఉంచబడినవి.
దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకొన్న సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించగా సతీదేవి శరీరం 18భాగాలుగా ఖండించబడి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో
పడిపోయినవి అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి పొందినవి. ఆలంపూర్ లో సతీదేవి యొక్క పైపళ్ళు పడిన వంటారు. ఆలంపూర్ తుంగభద్రా నదీ తీరంలో ఉన్నది. తుంగభద్ర మరియు కృష్ణానది కలిసే చోటుకూడా.
ఆలంపూర్‌లో ప్రధాన దేవతలు బ్రహ్మేశ్వరస్వామి మరియు జోగులాంబ. నల్లమల అడవులో వెలసిన ఈ ఆలయం దక్షిణకాశీగా కూడా పేరుపొందినది. పరశురాముని తండ్రి అయిన జమదగ్ని మహర్షి రేణుకా దేవి ఆశ్రమం కూడా ఇదేనని అంటారు.
నవబ్రహ్మకు సంబంధించిన తొమ్మిది ఆలయాలను కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడకు దగ్గరలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ప్రసిద్ధి చెందినది. క్రీ.శ.6వ శతాబ్ధంనాటి వస్తువులు వున్న మ్యూజియంను కూడా ఇక్కడ చూడవచ్చు.
ఆలయ దర్శన సమయాలు : ఉదయం గం.06-00 నుండి రాత్రి గం.08-00 వరకు తెరచి ఉంటుంది.
ఉత్సవాలు : మహాశివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అధికసంఖ్యలో భక్తులు వస్తారు.
ఎలావెళ్ళాలి : జోగులాంబా శక్తిపీఠం మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో కలదు. హైదరాబాద్ వైపునుండి వెళ్ళేవారు హైదరాబాద్-కర్నూల్ రైల్వేలైన్‌లో ఉన్న జోగులాంబ స్టేషన్‌లో దిగి వెళ్ళవచ్చు. (కొన్ని రైళ్ళు మాత్రమే ఈ స్టేషన్‌లో ఆగుతాయి) మరియు కర్నూలుకు 27 కి.మీ. దూరంలో ఉంది. అక్కడ నుండి రైలు లేక రోడ్డు మార్గాలలో వెళ్ళవచ్చు.
One of the Shaktippeeta Jogulamba Devi Temple is located in the town of Alampur in Mahbubnagar dist. of Andhra Pradesh. According to legends the upper jaw and teeth of Sati fell here. The temple is placed in a sacred
location at the confluence of the Krishna and Tungabhadra River. Jogulamba and Brahmeshwara are the two main deities of this temple. The main attraction of this temple is the idol of Jogulamba who has long hair with lizards, scorpion, bats and human skulls hanging from them. Other companions of Jogulamba are Veerabhadra, Vighneshwara and Saptmatrikas.