header

Asthadasa Shakthi Pethas, Shakti Peetalu

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువుసుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి


అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అష్టాదశ శక్తి పీఠాల పూర్తి వివరాల కోసం క్రింది లింక్ లను క్లిక్ చేయండి

శాంకరి - శ్రీలంక
కామాక్షి - కాంచీపురం, తమిళనాడు
శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ
భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్
మహాలక్ష్మి - కొల్హాపూర్,
ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా,
మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
పురుహూతిక - పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్
గిరిజ - ఓఢ్య, ఒరిస్సా
మాణిక్యాంబ - ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్
కామరూప - హరిక్షేత్రం, గౌహతి , అసోం
మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్
వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా,
చాముండేశ్వరీ దేవి – మైసూర్
మంగళగౌరీ దేవి - గయ
విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్
సరస్వతి - జమ్ము, కాష్మీరు .పాక్ ఆక్రమిత కాశ్మీరు