పఠాన్ కోఠ్ నుండి జోగేంద్రనగర్ వెళ్ళే దారిలో, జ్వాలాముఖి రోడ్ అనే స్టేషన్ ఉంది. స్టేషన్ నుండి 20 కి.మీటర్ల దూరంలో జ్వాలాముఖీ క్షేత్రం వుంది. ఇదే అష్టాదశ శక్తిపీఠాలలోని జ్వాలాముఖీ క్షేత్రం.
కాని ఇంకొక నమ్మకం ప్రకారం జమ్ము -కాశ్మీర్లోని కాట్రా దగ్గరలో గల వైష్ణోదేవి ఆలయాన్ని కూడా జ్వాలముఖీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఇక్కడి దేవీ పేరు వైష్ణోదేవి కావటం వలన ఈ అభిప్రాయం ఉంది. .
ఇక్కడ కాలధరమనే పర్వతం వుంది. పర్వతం మీద సతీదేవి యొక్క జిహ్య నిలువుగా పడింది. ఆప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రదేశం నుండి అగ్నిజ్వాల బయటకు వస్తూనే వుంది. ఈ కారణం చేతనే ఈ దేవిని జ్వాలాదేవి
అని పిలుస్తారు. జ్వాలా రూపంలో ఉన్నది కనుక వైష్ణవి కనుక జ్వాలా వైష్ణవి అంటారు. .
స్థలపురాణం: పూర్వం వైష్ణోదేవి అనే విష్ణు భక్తురాలు బ్రహ్మచారిణియై శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ స్వామి కటాక్షం కోసం చూస్తుంటుంది.
బైరూనాధుడనే తాంత్రిక మయాంత్రికుడు ఆమెను మోహించి ఆమెను పొందాలని తగిన సమయం కొరకు నిరీక్షించసాగాడు. ఒకసారి వైష్ణోదేవి త్రికూట పర్వత శ్రేణుల వద్దకు ప్రయాణమైనది. తన తాంత్రికశక్తితో బైరూనాధుడు ఈ విషయం గ్రహించి ఆమె వెనుకనే వెళ్ళసాగాడు. .
ఒక చోట అకస్మాత్తుగా ఆమె కనపడలేదు. మాంత్రికుడు తన తాంత్రికశక్తితో ఆమె ఆచూకి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు కాని సాధ్యపడలేదు. దారి తప్పిన బైరూనాధుడు ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. .
వైష్ణోదేవికి దాహం వేయగా దేవి ఒక ప్రదేశంలో భూమిలోపలికి బాణము వేయగా భూమిలోనుండి గంగ పెల్లుబికి వచ్చి ఆమె దాహం తీరుస్తుంది. ఈ ప్రదేశమునే చరణపాదుక అని అంటారు. దేవి సెద తీరుటకు కూర్చున్న ప్రదేశములో పడిన పాదముల గుర్తులు ఇప్పటికీ దర్శనమిస్తాయి. .
అటు పిమ్మట వైష్ణోదేవి ఒక గుహలో ధ్యానముద్రలో కూర్చుని ధ్యానంలో లీనమైపోయింది. ఆమెను వెదుకుతూ వచ్చిన బైరూనాధుడు తొమ్మిది నెలల అనంతరం ఆమె గుహలో ధ్యానంలో ఉండటాన్ని కనుగొంటాడు. అందువలనే గుహకు గర్భజున్ అనే పేరు వచ్చింది. .
భైరూనాధుడు గుహలోకి ప్రవేశించగా, దేవి రాక్షసుని బారిన పడకుండా గుహ వెనక ద్వారాన్ని త్రిశూలంతో ఛేదించి ఆ మార్గం నుండి వెళ్ళిపోతుంది. త్రికూట పర్వతము నందున్న దర్బారు వద్ధ, పవిత్రవైన గుహ వద్దకు చేరుకొని ఆమె ఉగ్రరూపం ధరించి బైరూనాధునితో యుద్దానికి తలపడుతుంది. ఆమె మాంత్రికుని తలను ఖడ్గంతో ఖండించగా తల ఎగిరి కొండ మధ్యపడుతుంది. మరణ సమయంలో బైరూనాధుడు తన తప్పును గ్రహించి దేవిని క్షమాపణ అడుగుతాడు. దేవి శాంతించి బైరూనాధుడుని క్షమిస్తుంది.
ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమచేయి పడినదని భావిస్తారు.
ఎలా వెళ్ళాలి ? జమ్ము నుండి 40 కి.మీ దూరంలో ఉన్న కట్రా నుండి 13
కి.మీ దూరంలో ఉన్న త్రికూట పర్వతం మీద శ్రీవైష్ణవీ దేవీ గుహాలయం ఉన్నది.
Temple in Kangra Valley, Himachal Pradesh -”Temple of Nine Undying Flames”
Centre of eternal beliefs, admiration, and sanctity, Jwala Devi temple is the abode of goddess Siddhida (Ambika). Located at a distance of 34 km south of Kangra Valley in Himachal Pradesh, this is one among the most visited temples in India where nine forms of the supreme deity are worshipped. Instead of idols, flames are worshipped as the manifestation of the deity. All these flames are seen to be erupting from the sides of a rock and they keep on burning constantly without any fuel. It is said that the tongue of Sati fell on this part. A divine earthly home of Shakti set amidst refreshing greenery, this temple displays a scenic view that rejuvenates your inner soul. The Seaja Bhawan of Jwala Devi depicts wonderful work of art especially the interiors.
Remark: Offering coconut in the Jwala devi temple is believed to be very fruitful.
There is a huge rush in this area with lakhs of devotees during the times of Chaitra Aswin Navratras and Shrawan Months from Delhi, Punjab, Himachal and other parts of India. Though otherwise, in the changing trends of modern followers, devotees from north India, specially Delhi, Punjab visit this place regularly on weekends. The locals prefer to visit mainly on Tuesdays and Fridays.