
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు.
పార్వతీదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరాచార్యులు ఇక్కడ పూజలు జరిపారు. అమ్మవారు యోగముద్రలో పద్మాసనంపై ఆశీనురాలై అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి క్రింది హస్తాలలో చెరకుగడ, తామర పుష్పం, చిలుక పై చెతులలో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటారు.
ఇక్కడ అమ్మవారు శక్తినంతా గ్రహించి మన్మధునిలో ఆవహింప జేస్తుందని, ఇంకొక కథనం ప్రకారం అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి ఆసనంలో ఉండటం వలన సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని అంటారు.
అమ్మవారు ఊగ్రరూపంలో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఊగ్రత్వాన్ని తగ్గించటానికి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని శంకారాచార్యులు కోరటంతో అమ్మవారు ఉత్సవాల సమయంలో శంకరాచార్యులవారి అనుమతి తీసుకొని బయటకొస్తుంది. ఈ దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది.
ప్రతి రోజూ ఉత్సవమూర్తికి మేలుకొలుపు, ప్రాతకాల నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షణగా ఆలయంలోకి తీసుకవస్తారు. ఈ దేవాలయం విశాలంగా ప్రశాంతవాతావరణంతో ఉంటుంది. అమ్మవారి దేవాలయానికి ఉదయం 5 గంటలకు వెళితే గోపూజా కార్యక్రమాన్ని చూడవచ్చు.
గోవు, గజశాల..
ఆలయంలోని కుడివైపున గజరాజుల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డు ఉంది.ప్రతీ రోజు ఉదయం గోపూజ, గజపూజను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు.
దర్శన వేళలు
ప్రతీరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ.. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8.30వరకు
ఎలా వెళ్లాలి..
కాంచీపురానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం ద్వారా...
కాంచీపురానికి వెళ్లేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకుని అక్కడ్నుంచి వెళ్లవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి కోయంబేడ్ బస్స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు.
రైలు మార్గంలో వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్లో దిగి అక్కడ్నుంచి కంచి వెళ్లాలి. లేదా నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరోమార్గం తిరుపతికి నేరుగా ట్రైన్లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లవచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి వెళ్లవచ్చు
Adi Shankaracharya, the famous 8th-century CE scholar and saint, established the Sri Chakra at this original Kamakshi Devi temple in the trough-like structure in that shrine, This Sri Chakra soon became the All India famous Kamakoti Peeta. The Acharya’s Lalitha Trishati Bhashya comments Kamakoti Peetam as Sri Chakra.
The Acharya changed the fierce form of worship into a sowmya form. The Devi in this original Kamakshi temple is called by various names like Kirtimati, Devagarbha in extant Tantric works like Tantrachudamani. She has four hands containing in each of them respectively, Ankusa, PAsa, Abhaya and a Kapala. This description
corresponds to those extant old tantric works. Further, Girvanendra Saraswathi describes precisely this swaroopa as Kameswari.